పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడంటున్న విద్యార్థులు

సాధారణంగా ఏదైనా పార్టీ నాయకుడు ప్రజలతో, విద్యార్థులతో ఇష్టా గోష్టీ చర్చా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఆ పార్టీ సంబంధీకులు చర్చా సమయంలోమాట్లాడేందుకు కొందర్ని ఏర్పాటు చేసి వారి చేతే మాట్లాడిస్తారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులతో ఇష్టా గోష్టి నిర్వహించాలని పవన్ కళ్యాణ్ భావించినప్పుడు నిర్వాహకులు ఇదే విషయాన్ని జనసేనాని వద్ద ప్రస్తావించారు. దానికి పవన్ కళ్యాణ్ బదులిస్తూ మనం ఏర్పాటు చేసి మాట్లాడిస్తే అది ఇష్టా గోష్టి ఎందుకు అవుతుంది, విద్యార్థులకు తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్చని ఇవ్వాలి. స్వతహాగా మాట్లాడాలని ముందుకు వచ్చే విద్యార్థులను మాట్లాడనివ్వండి అని అన్నారు. దీంతో అక్కడి విద్యార్థులకు తమ స్వంత అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్. ఈ చర్య పట్ల విద్యార్థులందరూ హర్షం వ్యక్తపరుస్తూ నాయకుడంటే ఇలా ఉండాలి అని కితాబిస్తున్నారు. ఈ ఇష్టాగోష్టిలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా విద్యార్థులకు సమాధానం ఇవ్వడం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. అనంతపురం సమస్యలను ప్రస్తావిస్తూ సమస్యలు తీరే దాకా పోరాడదాం అని విద్యార్థులకు పిలుపివ్వడం, ఢిల్లీకి రైలు యాత్ర చేపడుతానని చెప్పడం, తన జీవితంలో చిన్నతనంలో జరిగిన అనేక విషయాలను ప్రస్తావించడం, తాను చదువుకున్న విషయాలను ప్రస్తావించడం విద్యార్థినీ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. రాష్ట్రం లోని సమస్యలను అధ్యయనం చేయడానికి త్వరలో పాదయాత్ర చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. పేదలకు న్యాయం జరగాలని, రిజర్వేషన్ లపై వచ్చే పదే ఏళ్లలో చర్చలు జరుగుతాయి అని చెప్పడం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఇటువంటి తరహా ఇష్టా గోష్టిలను తమ జిల్లాలలో కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్రం లోని అనేక మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది విశ్లేషకులు చిరంజీవి చేసిన తప్పిదాలను పవన్ కళ్యాణ్ చెయ్యట్లేదని చిరంజీవి ఏనాడూ ఈ రకంగా నేరుగా  ప్రజలతో మమేకమయ్యే చర్యలు చేపట్టలేదుని భారీ బహిరంగ సభలు తప్పించి అంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుపుతున్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో రాజకీయాల్లో తీవ్ర మార్పులు వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ప్రజల సమస్యలను నేరుగా విని అధ్యయనం చేసేందుకు వారానికో రోజు రెండు గంటల పాటు టీవీ మరియు యూట్యూబ్ ద్వారా ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించి పరిష్కారం కాగల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపి, క్లిష్టతరమైన సమస్యలకు తన పార్టీకి అవకాశం కల్పిస్తే పరిష్కరిస్తానని తెలియజేసే కార్యక్రమానికి వచ్చే ఏడాదిలో పవన్ కళ్యాణ్ స్వీకారం చుట్టనున్నట్లు సమాచారం. ప్రజలతో నేరుగా మమేకం అయ్యేందుకు జనసేనాని ఇప్పటినుండే కార్యాచరణ రూపొందించుకుంటున్నట్టు సమాచారం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *