నోట్ల మార్పిడి రద్దు – కొన్నింటికి మినహాయింపు

రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన కేంద్రం మరో షాకిచ్చింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి నోట్ల మార్పిడి ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేవలం బ్యాంకు డిపాజిట్లకు మాత్రమే అనుమతిస్తారు. అర్ధరాత్రి నుంచి నగదు మార్పిడి కౌంటర్లలో మార్పిడికి ఛాన్స్ లేదని ప్రకటించింది. రేపటి (25-11-2016) నుంచి కేవలం డిపాజిట్‌కు మాత్రమే అనుమతిస్తారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేవలం డిపాజిట్ మినహా మార్పిడికి ఛాన్స్ లేదు.
  • విద్యుత్ బిల్లు, నీటి బిల్లులు సహా పలు వినియోగ ఛార్జీలకు పాత రూ.500 నోట్లతో చెల్లించుకొనే గడువు నేటితో ముగిసింది. అయితే, ఆ గడువును అంటే పాత రూ.500 నోట్లతో డిసెంబర్‌ 15 వరకు చెల్లించుకొనే వెసులుబాటును కేంద్రం కల్పించింది. పాత రూ.1000 నోట్లను మాత్రం తీసుకోరు. 
  • విదేశీయులకు వారానికి రూ.5వేల కరెన్సీని మార్చుకునే అవకాశం కల్పించారు. 
  • పాత రూ.500 నోటుతో అంతే మొత్తం ప్రీపెయిడ్ మొబైల్ టాపప్‌కు అవకాశం కల్పించారు.
  • సహకార రంగం సూపర్ బజార్లలో పాత నోట్లతో కొనుగోళ్లను రూ.5వేల వరకు పరిమితం చేశారు. 
  • వాటర్, విద్యుత్ బిల్లుల పాత బకాయిలు, ప్రస్తుత బిల్లులను చెల్లించవచ్చు. కానీ ఇది కేవలం వ్యక్తుల గృహాలకు మాత్రమే వర్తిస్తుంది. 
  • జాతీయ రహదారుల పైన విధించే టోల్ రుసుం గడువును డిసెంబర్ 2వ తేదీ వరకు పొడిగించారు. అదే సమయంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు పాత రూ.500 నోట్లతో ఆ రుసుంను చెల్లించుకోవచ్చు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *