దాని కోసం దేన్నైనా వదులుకుంటా: కాజల్ అగర్వాల్

బాహుబలి లాంటి అంతర్జాతీయ స్థాయి చిత్రంలో నటించే అవకాశం వస్తే దాని కోసం ఈ ప్రపంచంలో దేన్నైనా వదులుకోవడానికి సిద్ధమని కాజల్ అగర్వాల్ అంటోంది. మొదటి రెండు భాగాల్లో నటించనందుకు తానేమీ బాధపడటం లేదని, ఒకవేళ బాహుబలి-3 తీసేపనైతే అందులో అవకాశం కోసం ఎదురుచూస్తానంటోంది. అయినా రాజమౌళికి ఏ పాత్రకి ఎవరు కావాలో బాగా తెలుసని ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలియపరచింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఖైదీ నెంబర్ 150’ లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ కొడుకుతో కలిసి నటించిన తర్వాత తండ్రితో నటిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నేనో నటిని, నా పాత్ర పరిధి మేరకు ఎలాంటి పాత్రలైనా చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి అయినా చిరంజీవి లాంటి లెజెండ్ తో కలిసి నటించడం ఎప్పుడూ ప్రత్యేకమే అని చెప్పుకొచ్చింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *