డిసెంబర్ 9 న విడుదల కానున్న రామ్ చరణ్ ‘ధృవ’

రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా  గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై  డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శక‌త్వంలో  అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్రసాద్  సంయుక్తంగా నిర్మిస్తోన్న ధృవ‌ విడదల తేదీ ఫిక్స్ అయింది. డిసెంబర్ 9న ఈ సినిమా విడుదలవుతుంది. వాస్తవానికి ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ చాలా కారణాల వల్ల కుదరలేదు.  

ఈ చిత్రంలో  రామ్ చ‌ర‌ణ్ ప‌వ‌న్‌ఫుల్ ఐ.పి.య‌స్ ఆఫీస‌ర్ ధృవ‌గా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.   ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ – హిప్ హాప్ త‌మిళ ,  ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్, ఆర్ట్ – నాగేంద్ర, ఎడిటర్ – నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్రసాద్‌, దర్శకుడు – సురేందర్ రెడ్డి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *