జయలలిత కూతురి విషయం అంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టండి

ఇక్కడున్న ఫొటోలో కనిపించే మహిళను దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె అంటూ సోషల్ మీడియాలో విసృత ప్రచారం జరిగింది. ఇంకా జరుగుతోంది.
ఈమె జయలలిత కూతురని, సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారని, ప్రస్తుతం అమెరికాలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటున్నారని చెబుతూ ఆమె ఫొటోను ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. కొందరైతే ఈమె జయలలిత, శోభన్ బాబు లకు పుట్టిన ఆవిడ అంటూ తప్పుడు పుకార్లు చేసారు. ఇంకా చేస్తున్నారు. 
కానీ అసలు ఆమెకు, జయలలితకు ఏమాత్రం సంబంధం లేదు. ప్రముఖ గాయని, డబ్బింగ్ కళాకారిణి శ్రీపాద చిన్మయి అసలు ఆమె ఎవరు ఏమిటి అనే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.
చాలా కాలం నుంచి  ఈ ఫొటో ప్రచారం లో ఉంది. చాలామంది ఇప్పటికి అదే నిజమే అని భావిస్తున్నారు .
ఇంతకీ ఈ ఫొటో వెనక కథ ఏంటి….. అంటే  ఆమె పేరు దివ్యా రామనాథన్‌ వీరరాఘవన్.
జయలలిత కూతురు కానే కాదు. ఆమె ఆస్ట్రేలియాలో తన భర్తతో కలిసి ఉంటున్నారు.  తమిళనాడు రాజకీయాలకు, ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు. వాళ్లు తన కుటుంబానికి చాలా బాగా తెలిసిన వాళ్లని, మంచి శాస్త్రీయ సంగీత కుటుంబం నుంచి వచ్చారని చిన్మయి పేర్కొంది.
ప్రముఖ మృదంగ విద్వాన్ వి.బాలాజీ కుటుంబానికి చెందినవారని వివరించింది.  పేస్ బుక్ లో Chinmayi Sripada అకౌంట్ లో ఈ వివరాలు చూడవచ్చు. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *