ఆ రోజులే బాగున్నాయి…

టెన్షన్ లు..
ఒత్తిళ్ళు..
డబ్బు సంపాదన..
అతిగా ఆలోచనలు లేకుండా..
ఉన్నంతలో కుటుంబమంతా కలిసి..
ఆనందంగా గడిపిన..
ఆ రోజులే బాగున్నాయి…

ఆదివారం ఆటలాడుతూ..
అన్నాన్ని మరిచినా..
ఆ రోజులే బాగున్నాయి…

మినరల్ వాటర్ గోల లేకుండా..
పంపుల దగ్గర..
కాలవుల దగ్గర..
బావుల దగ్గర..
నీళ్ళు తాగినా..
ఆ రోజులే బాగున్నాయి…

ఎండాకాలం
చలివేంద్రాలలోని చల్లని నీళ్ళ కోసం..
ఎర్రని ఎండను సైతం లెక్కచేయని
ఆ రోజులే బాగున్నాయి…

వందలు కొద్ది చానళ్ళు లేకున్నా..
ఉన్న ఒక్క దూరదర్శినిలో..
శుక్రవారం చిత్రలహరి..
ఆదివారం సినిమా కోసం..
వారమంతా ఎదురు చూసినా..
ఆ రోజులే బాగున్నాయి…

సెలవుల్లో
అమ్మమ్మ, నానమ్మల ఊళ్ళకు వెళ్ళి
ఇంటికి రావాలనే ఆలోచనే లేని
ఆ రోజులే బాగున్నాయి…

ఏ.సి కారులు లేకున్నా ..
ఎర్ర బస్సుల్లో ..
కిటికి పక్క సీటులో నుండి
ప్రకృతిని ఆశ్వాదించిన..
ఆ రోజులే బాగున్నాయి…

మొబైల్ డేటా గురించి అలోచించకుండా..
పుట్టిన రోజు కోసం ఆలోచిస్తూ..
చాక్లెట్లు పంచిన..
ఆ రోజులే బాగున్నాయి…

మటన్ బిర్యాని, చికెన్ బిర్యాని లేకున్నా..
ఎండాకాలం వచ్చిందంటే..
ఆవకాయ పచ్చడితో అందరం కలిసి
కడుపు నిండా అన్నం తిన్న..
ఆ రోజులే బాగున్నాయి…

ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా..
పర్సు నిండా డబ్బులున్నా ..
కొట్టుకు పంపితే మిగిలిన చిల్లర దాచుకున్న ..
ఆ రోజులే బాగున్నాయి…

సెల్ నిండా ఆటలున్నా..
బ్యాట్ మార్చుకుంటు ఒకే బ్యాట్ తో క్రికెట్ ఆడిన..
ఆ రోజులే బాగున్నాయి…

ఇప్పుడు బీరువా నిండా బట్టలున్నా..
రెండు నిక్కర్లతో బడికి వెళ్ళిన..
ఆ రోజులే బాగున్నాయి…

ఇప్పుడు బేకరిలలో క్రీములు, కేకులు తింటున్నా..
ఐదు పైసల కొబ్బరి బిళ్ళ తిన్న ..
ఆ రోజులే బాగున్నాయి…

చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న
ఈ రోజుల్లో పిల్లలము కొట్టుకున్నా
పెద్దలంతా కలిసి ఉండే..
ఆ రోజులే బాగున్నాయి…

ఇప్పుడు ఇంటి నిండా తినుబండారాలున్నా
నాన్న కొనుక్కొచ్చే చిరుతిళ్ళ కోసం
ఎదురుచూసిన
ఆ రోజులే బాగున్నాయి…

ఇప్పుడు రకరకాల ఐస్ క్రీములు చల్లగా నోట్లో కరుగుతున్నా
అమ్మ పోపు డబ్బా పైసలతో
పుల్ల ఐసు కొని తిన్న
ఆ రోజులే బాగున్నాయి…

పొద్దుపోయేదాక చేలో పని చేసుకొచ్చి
ఎలాంటి చీకు చింత లేకుండా
ఆకాశంలోని చందమామను చూస్తూ నిదురించిన
ఆ రోజులే బాగున్నాయి…

ఆ రోజులే ఎంతో బాగున్నాయి…
ఆ రోజులే ఎంతో బాగున్నాయి…
ఆ రోజులే ఎంతో బాగున్నాయి…

Add a Comment

Your email address will not be published. Required fields are marked *