అవకాశాలు లేని బ్రహ్మానందం ఆ డైరెక్టర్ ని బ్రతిమిలాడుకుంటున్నాడు!

తెలుగులో తనదైన స్టయిల్‌లో కామెడీని పండిరచి ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వును పుట్టించే అద్బుత హాస్య నటుడు బ్రహ్మానందం. చాలాకాలం నుండి నవ్వుల ప్రపంచంలో రారాజుగా ఏలుతున్న బ్రహ్మీకి ఈ మధ్య కాలంలో అవకాశాలు పెద్దగా రావడం లేదు. యువ కమెడియన్‌లు రావడంతో బ్రహ్మీ లాంటి సీనియర్‌ హాస్యనటులకు అవకాశాలు కరువుయ్యాయి. గతంలో బ్రహ్మీని దృష్టిలో పెట్టుకుని ఒక పాత్రను సృష్టించే దర్శకులు తమ కథకు ఎవరు సూట్‌ అయితే వారినే ఎంపిక చేస్తాము అన్నట్టుగా కాలం మారింది.

కొత్త చిత్రాలలో బ్రహ్మీకి అవకాశాు తక్కువగా వస్తున్నాయి. అందమైన పాత్రలతో కథలను తెరకెక్కించే దర్శకుడు శ్రీనువైట్ల చిత్రంలో బ్రహ్మీకి ఒక పాత్రను ఇస్తున్నాడు. చాలాకాలం గ్యాప్‌ తర్వాత రాబోతున్న ఈ చిత్రంలో తన పాత్రను కాస్త వెరైటీగా తీర్చిదిద్దమని బ్రహ్మీ శ్రీను వైట్లను బతిమాలుతున్నాడు. ప్రేక్షకులకు బాగా గుర్తు ఉండేలా, అవకాశాలు కూడా మళ్లీ వచ్చేలా తన పాత్రను డిజైన్‌ చేయమని బ్రహ్మీ శ్రీనివైట్లను రిక్వెస్ట్‌ చేస్తున్నాడు. ఈ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయితే ఇంకొన్నాళ్లు బ్రహ్మీ మనల్ని నవ్విస్తాడన్నమాట!

Add a Comment

Your email address will not be published. Required fields are marked *