జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 4000 పీఓఎస్ మెషీన్లు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
November 24, 2016
ప్రభుత్వం జిల్లాలో నగదు రహిత సేవలకు శ్రీకారం చుట్టింది. బుధవారం రవాణా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు నగదు రహిత సేవల కోసం పిఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) స్వైపింగ్ మెషీన్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో 82 పిఓఎస్ మెషీన్లను ప్రారంభించామని 4000 మెషీన్ లు కావాలని బ్యాంకులకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో ఉండే 1891 రేషన్ షాపుల్లో కూడా పిఓఎస్ మెషీన్లు ఏర్పాటు చేస్తున్నామని ఇలా ప్రతి విభాగానికి నగదు రహిత సేవలను విస్తృతం చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా త్వరలో నగదు గా కాకుండా కేవలం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే ప్రభుత్వ శాఖల్లో లావాదేవీలు జరిగే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.