MP Raghurama: మీరేమో అన్ని రేట్లు పెంచుకోవచ్చు.. సినిమా వాళ్లకు తగ్గిస్తారా?- ఆర్ఆర్ఆర్
MP Raghurama: ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఏదో చిన్న చిన్న మాటలతో పోతున్న ఈ సమస్య.. హీరో నాన్న చేసిన కామెంట్లతో అగ్గి రాజేసుకున్నట్లైంది. ఈ క్రమంలోనే హీరో నానిపై అధికార ఎమ్మెల్యే, మంత్రులు మాటలతో విరుచుకుపడుతున్నారు. అయితే, మరోవైపు, నానికి మద్దుగా ప్రతిపక్షాలు గలం విప్పుతున్నాయి. తాజాగా, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్‌ను ఉద్దేశించి సామాజిక మాద్యమాల వేదికగా సెటైర్స్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
మీ పత్రిక రేట్ పెంచేది.. ‘నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు మెరుగైన వార్తలు అందించడానికని అంటారు. మీ సీమెంట్ రేటు పెంచేది.. సిమెంట్ నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు మెరుగైన సిమెంట్ అందించడానికని అంటారు. మీ కంపెనీలు అమ్మే విద్యుత్ రేటు అమ్మేది.. నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడానికని చెప్తారు.. మరి సినిమా హాళ్లలో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి, ప్రజలకు మెరుగైన వినోదపు సేవలు అందించడానికి టిక్కెట్ల ధరను ఎలా తగ్గిస్తారు. అంటూ రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం ఈ ట్వీట్‌తో సినీ ఇండస్ట్రీతో పాటు, పలువురు నెటిజన్లు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా టికెట్ కలెక్షన్ల కంటే.. పక్కనుండే కిరాణా కొట్టులో కలెక్షన్లు బాగుంటున్నాయని నాని అన్నారు. మరో వైపు బ్రహ్మాజి కూడా జగన్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో టాలీవుడ్ వర్సెస్ ఏపీ సర్కార్ అన్నట్లు అయ్యింది పరిస్థితి.