నిందితులను హత్య చేసే కుట్ర ఉందంటూ సీబీఐకి వైసీపీ ఎంపీ లేఖ

జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐకి లేఖ రాశారు. విచారణ ఆలస్యం జరిగితే నిందితులు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పరిటాల రవీంద్ర హత్య కేసు మాదిరిగానే నిందితులను హత్య చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని కోరారు. వివేకా హత్య వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తేల్చాలని, ఓ ఎంపీనీ విచారించాలని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ ప్రతిష్టకు కూడా భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

2019 మార్చి 15న వివేకా హత్యగావింపబడ్డారు. కూతురు సునీతారెడ్డి హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణను కోరింది. దీంతో విచారణను గతేడాది ప్రారంభించిన సీబీఐ సుమారు 112 మందికి పైగా కీలక వ్యక్తులను విచారించింది. దీంతో హత్యలో పాల్గొన్న దస్తగిరి అప్రూవర్ గా మారి కొన్ని సంజలన విషయాలు బయటపెట్టారు. హత్య వెనక అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నట్లు తనతో ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఇంకొంతమంది వాంగ్మూలాలు బయటకు వచ్చాయి.

వీటిల్లో సునీతారెడ్డి వాంగ్మూలం కూడా బయటపడింది. హత్య గురించి జగన్ వద్ద ప్రస్తావిస్తే అవినాష్ రెడ్డి ఎందుకు చంపుతారని, నీ భర్తే చంపాడేమో అని అని తనపైనే నిందలు వేసినట్లు చెప్పారు. అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తనకు రెండు కళ్లలాంటి వాళ్లని కూడా అన్నట్లు తెలిపింది. అనంతరం అవినాష్ కు సీబీఐ నోటీసులివ్వడానికి వస్తే తిరస్కిరంచినట్లు తెలిసింది. అనంతరం విచారణ మళ్లీ మందగించింది. ఈ క్రమంలో సీబీఐ చీఫ్‌కు ఎంపీ రఘురామ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది

 

 

 

 

 

 

 

 

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *