అంతా మా ఇష్టమంటూ వైసీపీ కార్యకర్తలు ఏకంగా పోలీసులపైనే..

అధికారంలో ఉన్నామన్న అహంకారమో, తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియకనోగానీ ఏపీలో కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏకంగా పోలీసులపైనే జులం విదిలిస్తున్నారు. మేము అధికారంలో ఉన్నాం, అంతా మా ఇష్టమంటూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఏకంగా పోలీసులపైనే చేయి చేసుకుని, సెల్ ఫోన్లు, స్టేషన్ లో సామాగ్రిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇదొక్కటే కాదు,  ఇంతకముందు కూడా వైసీపీ నేతలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్ను.

Ycp Leaders and Activista Drunk On Police Vehicle

ఈ ఘటన మరువక ముందే పరిపాలన రాజధాని చేస్తామని చెప్పుకుంటున్న విశాఖలో మరో వివాదం చోటు చేసుకుంది. మాకవరపాలెం దాబాలో మద్యం తాగి వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. దీంతో గోలను పడలేక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులను సైతం లెక్కచేయని స్థితిలోకి వైసీపీ నేతలు వెళ్లారు. నీకు సమాధానం చెప్పడానికి ఎమ్మెల్యే రావాలా?, మేము ఏం చేసినా మా ఎమ్మెల్యే చూసుకుంటాడు.. అంటూ పోలీసులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ వైసీపీ నేతలు.

 

మద్యం తాగి హల్ చల్ చేసిన వారిలో గొలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీ భర్త సన్యాసినాయుడు,  పాకలపాడు స్కూల్ కమిటీ చైర్మన్ నానాజీ వారి స్నేహితులు ఈ రచ్చలో ఉన్నారు. వైసీపీ నేతలు చేసిన ఈ దూందాం దృష్యాలు సోషల్ మీడియాలో తెగ వైరలై పోతున్నాయి. దీంతో కొందరు వైసీపీ నేతల తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకుంటారా..? అధికార బలానికి తలొగ్గుతారనేది వేచిచూడాల్సిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *