సభ నిర్వహించి తీరుతా.. కాకాణికి పోటీ కాదు : మాజీ మంత్రి అనిల్

నెల్లూరు వైసీపీలో రాజకీయం రచ్చకెక్కుతోంది. తాజా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య కోల్డ్ వార్ జరురుతుంది. విషయంలోకి వెళ్తే ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాణి గోవర్థన్ రెడ్డి ఆదివారం నెల్లూరులో సభను నిర్వహిస్తున్నారు. ఆత్మయ సమ్మేళనం పేరిట మంత్రిగా బాద్యతలు స్వీకరించాక మొదటి సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆదివారం నాడు సభను నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఆయనే స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తన అనుచరులను ఆదేశించారు.

అంతేకాదు రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయితే దీనిపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సభను నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఇది ఎవరికీ పోటీ సభ కాదు అని అన్నారు. వారం రోజుల ముందే సభకు అనుమతి తీసుకున్నామని తెలిపారు. సభను వాయిదా వేసుకోవాలని పార్టీ హైకమాండ్ కూడా తనకు చెప్పలేదని అన్నారు. ఎవరో కార్యక్రమం పెట్టుకున్నారని, తాను సభను పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే నాలుగు రోజుల క్రితం కాకాణిపై ఇన్ డైరెక్ట్ గా అనిల్ వ్యాఖ్యలు చేశారు.

తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి బాగా సహకరించారని, ఆయన తనపై చూపించన ప్రేమకంటే రెండింతలు చూపిస్తానని మాట్లాడారు.  దీనిపై కాకాణి వర్గం రగిలపోతోంది. మంత్రి పదవి చేపట్టిన నాడు కూడా అనిల్ వ్యాఖ్యలు వారికి రుచించిలేదు. ఇక రెండు వర్గాలు ఆదివారం నిర్వహించే సభకు పోటాపోటీగా ఏర్పాటు చేస్తున్నాయి. ఏం జరగుతుందా అని వైసీపీ క్యాడర్ ఎదురు చూస్తోంది. మంత్రి పదవులు నెల్లూరు వైసీపీలో చిచ్చు రాజేస్తాయో లేదో చూడాల్సిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *