బెల్లం స్వప్నకి డాక్టరేట్ ప్రధానం చేసిన విక్రమ సింహపురి యూనివర్శిటీ
నెల్లూరు నగరం బాలాజీ నగర్ ఉస్మాన్ సాహెబ్ పేట కి చెందిన బెల్లం శ్రీనివాసులు, సుభాషిణి దంపతుల కుమారై బెల్లం స్వప్నకి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. ఈమె టూరిజం మేనేజ్ మెంట్ విభాగంలో డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ మైలా త్యాగరాజు పర్యావేక్షణలో “రోల్ ఆఫ్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఇన్ ప్రమోటింగ్ కల్చరల్ టురిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ” (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాంస్కృతిక పర్యాటక అభివృద్ధిలో ఉత్సవాలు మరియు పండుగల పాత్ర) అనే అంశం పై పరిశోధన చేసారు.
ఐదేళ్ళ పాటు సాగిన ఆ పరిశోధనకు సంబంధించిన పరిశోధనా గ్రంథాన్ని సమర్పించినందుకు గాను విక్రమ సింహపురి యూనివర్శిటీ ఆమెకు డాక్టరేట్ ప్రధానం చేసినట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా స్వప్నని వర్శిటీ వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ఎం.సుందరవల్లి, రిజిస్ట్రార్ డాక్టర్ లేబాకు విజయకృష్ణారెడ్డి (ఎల్వీకే) అభినందించారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు, విభాగాధిపతి, అధ్యాపకులు, సహ-పరిశోధన విద్యార్థులు, ఆమెను అభినందించారు.