మైకెల్ జాక్సన్ ను తలపించేలా మహిళ డ్యాన్స్..!

ప్రస్తుతం ఉన్న సోషల్​ మీడియా ద్వారా ప్రజల్లో ఉన్న ట్యాలెంట్​ అనేది బయటకు వస్తుంది. ఒకటి కాదు రెండు కాదు లక్షలాది మంది సోషల్​ మీడియాలో తమ ట్యాలెంట్​ చూపించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఒకప్పటి డబ్​ స్మాష్​ నుంచి టిక్​ టాక్​ వరకు తమ దైన శైలిలో సామాజిక మాధ్యామాల్లో వైరల్​ అవుతున్నారు. మరి కొందరికి అయితే సినిమా చాన్సుల కూడా వచ్చాయి. అయితే ఇలాంటి ట్యాలెంట్ ఉన్న మహిళ ఒకరు ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతున్నారు.

viral video woman dancing
viral video woman dancing

ఒకప్పుడు రాను మండల్ అనే ఆమె అచ్చం లతా మంగేష్కర్‌ లాగా పాడి కేవలం కొద్ది రోజుల్లోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారి సినిమాల్లో కూడా పలు పాటలు పాడారు. ఇంత ట్యాలెంట్ ఉన్న ఓ మహిళ డ్యాన్సింగ్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈమె వేసిన డ్యాన్సును చూసిన కొందరు ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. ఈమె ఓ లేడి మైకెల్​ జాక్సన్​ అని అంటున్నారు.

https://www.instagram.com/reel/CaTqaomJb76/?utm_source=ig_embed&ig_rid=c04baa41-b722-482d-af75-f9b954794e87

హిందీలో హీరో హృతిక్ రోషన్ చేసిన ఓ సినిమాలోని ఏక్ పాల్ కా జీనా అనే పాటకు అమె స్టెప్పులు వేశారు. బాలీవుడ్ లో ఓ రేంజ్​ లో డ్యాన్​ వేసేది అంటే కచ్చితంగా హృతిక్ రోషన్ అనే చెప్పవచ్చు. అలాంటి అచ్చం ఆయన లాగే స్టెప్పులు వేసి ఇరగదీసింది ఈ లేడీ మైకిల్​ జాక్సన్​. ఈమె చేసిన ఈ డ్యాన్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యామాలో వైరల్​ గా మారింది. కాబోయే సెలబ్రటీ అంటూ ప్రతీ ఒక్కరు ఆమెను పొడుగుతున్నారు. కామెంట్లు కూడా చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *