ఆరేళ్ల పాటు సోషల్​ మీడియాకు దూరంగా ఉన్నాడు … చివరకు?

ఓ తల్లి తన 18 ఏళ్ల కొడుకుని సోషల్ మీడియాలో అమాంతం ఎత్తేస్తుంది. మా వాడు తోపు, మా వాడు తురము అని ఓ రేంజ్​ లో పొగిడేస్తుంది. మా అబ్బాయిలా ఉండడం మరి ఎవరి తరం కాదని అంటుంది. తన కొడుకు చేసిన ఛాలెంజ్​ ప్రకారం నడుచుకుని చిన్న వయసులోనే మాట మీద నిలబడినట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ వాళ్ల అబ్బాయి చేసిన ఛాలెంజ్ ఏంటీ? ఎందుకు ఆమె అంత ఎగ్జైట్​ అవుతుందని అనుకుంటున్నారా? దానికి ఓ కారణం ఉంది.

viral news 18 year old gets 1800 dollars reward from mom
viral news 18 year old gets 1800 dollars reward from mom

అది ఏమిటంటే… ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అందులో వాట్సాప్ అని ఫేస్బుక్​ అని లేకపోతే ట్విట్టర్​ అదీ కాకాపోతే ఇన్స్ స్టాగ్రామ్​ అని ఇలా చాలానే ఉంటున్నాయి. మనలో చాలా మంది.. అంటే సుమారు వందకు 99 శాతం మంది వాటిని ఉపయోగిస్తున్నారు. ఉపయోగించకుండా ఉండేది ఎవరైనా ఉన్నారటే వారు ప్రపంచానికి దూరంగా బతుకుతున్నట్లు లెక్క. అయితే పైన మనం చెప్పుకున్న ఆమె కుమారుడు అందరిలానే ఉంటూనే సుమారు 6 ఏళ్ల పాటు సోషల్​ మీడియాకు దూరంగా ఉన్నాడంట. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లితో చేసిన ఓ ప్రతిజ్ఞతోనే సుమారు ఆరేళ్ల పాటు దూరంగా ఉన్నట్లు తెలిస్తుంది.

అయితే తల్లితో ఆ కుమారుడు తొలుత బెట్​ కాసాడు. నాటి నుంచి సరిగ్గా ఆరేళ్లు పూర్తి అయ్యే వరకు ఒక్క సారి కూడా సోషల్​ మీడియా జోలికి వెళ్లలేదు. అయితే తల్లితో తాను చేసిన ఛాలెంజ్‌ను నెగ్గడంతో ఆ అమ్మ అతనికి సుమారు 1,800 డాలర్ల ప్రైజ్ మనీ కొడుక్కు ఇచ్చింది. దీనితో పాటుగా ఓ కొత్త ఫోన్​ కొనిచ్చిన ఆమె వాటిలో సోషల్ మీడియా యాప్ లను కూడా వేసి ఇచ్చింది. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా? తల్లి పేరు లోర్నా గోల్డ్ స్ట్రాండ్ క్లెఫ్‌సాస్. కొడుకు పేరు సీవర్ట్‌. ఇదిలా ఉంటే ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *