ఇదేందయ్యా ఇది.. పెళ్లి చూడడానికి వచ్చాడు.. తాళి కట్టాడు!
అక్కడ పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. వరుడు, వధువు పట్టువస్త్రాలు, బంగారు నగలతో అందంగా ముస్తాబై వచ్చారు. పెళ్లి మండపంలో శాస్త్రోక్తంగా మంత్రాలు జపిస్తున్నారు. ఈ వేడుకకు వచ్చిన బంధుమిత్రులంతా ఎదురుగా కూర్చొని వీక్షిస్తున్నారు. వారి మధ్యలో ఓ కుర్రాడు చేరాడు. అందరిలాగే వచ్చి… ఓ కుర్చి వెనుక నిల్చున్నాడు. ఆ కుర్చీలో అమ్మాయి ఉంది. పెళ్లి తంతును తీక్షణంగా పరిశీలిస్తోంది. సరిగ్గా తాళి కట్టే సమయంలో ఆ వెనుక నిల్చున్న యువకుడు ఊహించని పని చేసి… అందరికీ షాక్ ఇచ్చాడు.
పెళ్లి మండపంలో ఘనంగా వివాహ వేడుక జరుగుతోంది. పెళ్లి కూతురు, వరుడు ఇద్దరు సిగ్గులు పూస్తూ… ఆ తంతులో పాల్గొంటున్నారు. ఇంతలో ఓ కుర్రాడు పింక్ కలర్ షర్ట్ వేసుకొని… వచ్చాడు. ఎదురుగా ఉన్న కుర్చీల దగ్గర నిల్చున్నాడు. ఓ కుర్చీలో అమ్మాయి కూర్చోగా… సరిగ్గా దాని వెనకాలే నిల్చున్నాడు. ఇక పెళ్లి ముహుర్తం ఆసన్నమైంది. పంతులు గారు… మంత్రాలను గట్టిగా జపిస్తున్నారు. అందరూ ఆ వివాహ వేడుకను చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలోని ఆ కుర్రాడు షాక్ ఇచ్చాడు. పెళ్లి మండపంలో వరుడు తాళి పట్టుకున్నవేళ… ఈ కుర్రాడు కూడా జేబులో నుంచి పసుపు తాడు తీశాడు. వరుడు వధువు మెడలో మూడు ముళ్లు వేస్తున్న వేళ… ఈ కుర్రాడు కూడా కుర్చీలో కూర్చున్న అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు.
ఈ రెండు పెళ్లిళ్లు జరుగుతుండగా.. అక్కడ కూచున్నవాళ్లంతా అటూ ఇటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే ఇదంతా సరదా అనుకున్నారు. పెళ్లి తంతు ముగిసింది. కానీ అనంతరం ఆ కుర్రాడు అమ్మాయి చేయి పట్టుకొని… తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. అయితే ఇది కావాలని చేశారా? ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది అనే అంశాలపై క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఆ వీడియోను మీరు ఓ సారి చూసేయండి మరి..!