రష్మికతో పెళ్లి రూమర్స్‌పై విజయ్‌ దేవరకొండ ఫైర్‌.. ఏమన్నాడంటే..!

పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించాడు. ‘గీత గోవిందం’,’డియర్‌ కామ్రేడ్‌’ సినిమాల్లో విజయ్‌, రష్మిక మందన్నా కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచే వీరిద్దరి మధ్య సమ్‌ థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందంటూ మీడియాల్లో కథనాలు వెల్లువెత్తున్నాయి. ఇద్దరూ కలిసి కొన్నిసార్లు బయట కనిపించడంతో ఇక ఫిక్స్‌ అయిపోయారు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ కలిసి ఉన్న ఫొటోల్ని, వీడియోలను షేర్‌ చేస్తున్నారు. ఇక థంబ్‌నెయిల్స్‌ బ్యాచ్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రూమర్స్‌ను వాళ్లు పలుమార్లు ఖండించినా పెద్ద ప్రయోజనం లేకపోయింది.

vijay devarakonda on fire about his marriage rumours with rashmika

అయితే తాజాగా రష్మిక ప్రేమ, పెళ్లిపై తన అభిప్రాయాలు వెల్లడించింది. ఆ తర్వాత నుంచి ఈ రూమర్స్‌ ఇంకా ఎక్కువయ్యాయి. వీరికి నేషనల్‌ లెవల్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండటంతో బాలీవుడ్‌లో సైతం గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. తాజాగా కొన్ని బాలీవుడ్‌ వెబ్‌సైట్లు.. వాటి ఆధారంగా కొన్ని లోకల్‌ వెబ్‌సైట్లు ఓ అడుగు ముందుకు వేసి కథనాలు ఇచ్చాయి. వీటితో చిర్రెత్తి పోయిన విజయ్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ప్రతీసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందని ట్విటర్‌లో కాస్త బూతుపురాణంతోనే అసహనం వ్యక్తం చేశాడు దేవరకొండ. తద్వారా అది ఒక ఫేక్‌ వార్త అని చెబూతనే.. మీడియాకు కౌంటర్‌ ఇచ్చారు. ఇక ఈ ట్వీట్‌ కు రష్మికు కూడా సపోర్ట్‌గా నిలిచింది.

ప్రస్తుతం రష్మిక, విజయ్ తమ తమ చిత్రాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ షూటింగ్ ఇటీవల కంప్లీట్ చేశారు. లైగర్ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. అనంతరం విజయ్.. దర్శకుడు సుకుమార్‌తో మూవీ ప్రకటించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *