నెట్టింట్లో తెగ సందడి చేస్తున్న పుష్ప.. మరీ ఇంతనా!

Viral Videos: ఇటీవల థియేటర్ లో తెగ సందడి చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’. ఇక ఇందులో కథ ఒక ఎత్తయితే ఇందులో పాటలు మరో ఎత్తు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీవల్లి పాట మాత్రం ఇన్ స్టాగ్రామ్ రీల్స్ రూపంలో బాగా హడావిడి చేస్తుంది. నెటిజన్ల నుంచి సెలబ్రేటీలు వరకు ఈ పాటలకు తెగ స్టెప్ లు వస్తున్నారు.

ఇదే క్రమంలో ఆ మధ్య ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సూర్య కుమార్, ఇషాన్ కిషన్ లు బన్నీలా.. అదే స్టెప్ చేస్తూ నెటిజన్ల ను తెగ ఆకట్టుకున్నారు. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా ‘ముంబైఇండియన్స్’ అనే పేజీలో పంచుకున్నారు.

ఇక తాజాగా ఓ యువతి సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ.. బరువుతో కలిగిన బ్యాగ్ ను మోస్తూ శ్రీవల్లి పాటను చక్కగా ఇమిటేట్ చేస్తూ ముందుకు వెళుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూ నెట్టింట్లో వైరల్ గా మారింది.

అంతకు ముందు ఇదే పాటకు పోర్చుగీస్ కు చెందిన తండ్రి, కూతుర్లు నెట్టింట్లో తెగ హడావిడి చేశారు. వీరిద్దరూ పదే పదే అద్దం ముందు రకరకాల డాన్స్ లు చేస్తున్నారు. వీరు చేసిన శ్రీవల్లి పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

అదే ఇన్ స్టాగ్రామ్ లో మరో పేజీ లో ఇంటి ముందు తుడిచేందుకు ప్రయత్నిస్తున్న ఓ అకతాయి. అంతలోనే ఏమైందో ఏమో ఒకేసారి శ్రీవల్లి సాంగ్ స్టెప్ ఇమిటేట్ చేస్తున్నాడు. చూస్తుంటే శ్రీవల్లి సాంగ్ కి దేశవ్యాప్తంగా లవర్స్ బాగానే పెరిగారని తెలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *