కుక్క కడుపులో 25 గోల్ఫ్ బాల్స్.. ఏం జరిగింది?
పెంపుడు జంతువులంటే కొందరికీ మహా ఇష్టం. కన్నపిల్లలతో సహా వాటిని పెంచుకుంటారు. ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తారు. మరికొందరైతే పిల్లలు పుట్టకముందే కూడా వీటి వల్ల తల్లిదండ్రులుగా మారుతారు. వాటికి తినిపించడం, వాష్ చేయడం వంటివి చేస్తూ చిన్న పిల్లలను చూసుకున్నట్లు కేర్ చేస్తారు. వాటి ప్రతి కదలికను గమనిస్తారు. ఇలాంటి సన్నివేశం ఓ చోట జరిగింది. ఓ యజమాని తన కుక్క ఇటీవల నీరసంగా ఉంటోందని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పొట్ట కూడా ఉబ్బినట్లుగా ఉందని వైద్యులకు చెప్పారు.
నీల్ అనే వ్యక్తి అల్ఫీ అనే పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. నీల్ దానితో చాలా కాలక్షేపం చేస్తారు. అయితే గత కొంత కాలంగా ఆల్ఫీ చాలా నీరసంగా ఉంటోంది. అంతే కాకుండా దాని పొట్ట ఉబ్బినట్లుగా ఉంది. అంతే కాకుండా తరుచుగా వాంతులు చేసుకుంటోంది. ఇది గమనించిన నీల్… ఆల్ఫీ ని వైద్యుని దగ్గరకు తీసుకెళ్లారు. స్కాన్ చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కుక్క కడుపులో 25 గోల్ఫ్ బాల్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆపరేషన్ అనంతరం ఆ బాల్స్ ను కుక్క కడుపులోనుంచి తొలగించారు.
కుక్క కడుపు లోని గోల్ఫ్ బాల్స్ ను తొలగించడానికి ఆపరేషన్ నిర్వహించారు. ఇందుకు దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు అయింది. అయితే ప్రస్తుతం ఆ కుక్క ఆరోగ్యవంతంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంతకీ 25 గోల్ఫ్ బాల్స్ కుక్క కడుపులోకి ఎలా వచ్చాయని వైద్యులు షాక్ అవుతున్నారు. ఇలాంటి కేసు తాము ఇంత వరకు చూడలేదని అంటున్నారు.