ఆ వ్యక్తి అడగకూడనిది అడిగాడు.. ఆ గదిలో బోలెడుమంది ఆపే ప్రయత్నం కూడా చేయలేదు: సన్నీలియోన్ ఎమోషనల్ కామెంట్స్

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించి తెలియని వారెవ్వరు లేరు. ఎందుకంటే హాలీవుడ్ నీలి చిత్రాల్లో నటించి బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది. ఇక ఇప్పుడు పూర్తిగా పోర్న్ సినిమాలను దూరం పెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది.

సన్నీ లియోన్ అంటేనే చాలామంది మరో ఉద్దేశంతో చూస్తుంటారు. ఇప్పటికీ చాలామంది తనను నటిగా కంటే అదే ఉద్దేశంతో చూసి ఎన్నో రకాల విమర్శలు చేశారు. కానీ వ్యక్తిగతంగా సన్నీలియోన్ మాత్రం మంచి మనసున్న వ్యక్తి. ఇదిలా ఉంటే తాజాగా సన్నీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తాను గతంలో పాల్గొన్న వివాదస్పద ఇంటర్వ్యూ గురించి తెలిపి బాగా ఎమోషనల్ అయ్యింది.

2016లో తనకు దురదృష్టకర ఇంటర్వ్యూ జరిగిందని తెలిపింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత తను మానసికంగా కోలుకోవడానికి సమయం పట్టిందని తెలిపింది. తనను మాజీ పోర్న్ స్టార్ గా నిలబెట్టి ఓ జర్నలిస్ట్ అడగరాని ప్రశ్నలు అడిగాడని.. ఆ గదిలో బోలెడు మంది వరుసలో కూర్చుని ఉన్నా కూడా ఆ ప్రశ్నలను విని ఆ ఇంటర్వ్యూను ఆపే ప్రయత్నం చేయలేదని తెలిపింది.

ఆ ప్రశ్నలు వింటూ తను చెప్పే సమాధానాలు చూస్తూ ఉండిపోయారని.. ఎవరు కూడా తమ నిరసన తెలుపలేదని.. అక్కడున్న వాళ్లంతా అలా ప్రవర్తించడంతో చాలా బాధ అనిపించింది అని ఎమోషనల్ గా తెలిపింది సన్నీ. ఇక ప్రస్తుతం సన్నీ పలు ప్రాజెక్టుల లో బిజీగా ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *