తన సోదరుడితో అలా లింకు పెట్టారంటూ ఎమోషనలైనా హీరోయిన్!

భారతీయ సినీ నటి రవీనా టాండన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈమె ‘బంగారు బుల్లోడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఆకాశవీధిలో, రథసారధి, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, బెంగాలీ వంటి భాషలలో నటించింది.

ఈమె నటిగా కంటే వ్యక్తిగతంగా వార్తల్లో బాగా నిలిచింది. అప్పట్లో ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని అతడిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైందని కానీ తమ మధ్య బ్రేకప్ జరిగిందని బాగా వార్తలు వచ్చాయి. ఇవే కాకుండా మరెన్నో పుకార్లు కూడా ఎదుర్కొంది. తాజాగా తాను గతంలో ఎదుర్కొన్న విషయాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవీనా.. తాను గతంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను పంచుకుంది. తాను నటించిన సినిమాల్లోని.. నటులను ఫ్రెండ్స్ వలె చూసుకుంటానని తెలిపింది. కానీ మ్యాగజైన్ ఎడిటర్స్ మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోరని, ఒకప్పుడు విచిత్రంగా తన సోదరుడుతోనే పుకార్లు సృష్టించారని తెలిపింది.

తాను గతంలో ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు.. షూటింగ్ స్పాట్ కు తన సోదరుడు డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు.. తన సోదరుడుని చూసి.. మేము రవీనా టాండన్ బాయ్ ఫ్రెండ్ ను కనుగొన్నాం అని వార్తలు రాశారని.. దీనివల్ల ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని తెలిపింది. దీంతో జర్నలిస్టుల స్వభావం గురించి మాట్లాడుతూ.. ఎవరికైనా హలో చెప్పిన సరే అందులో బూతు కోసమే వెతుకుతున్నారని మండిపడింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *