వివేకాకు గుండెపోటని ప్రచారం చేసింది ఆ నలుగురే..!
వివేకా హత్య విషయంలో సీబీఐ విచారణ వేగం పెంచింది. ఈ సందర్భంలోనే గతంలో అనుమానితులు, ఇతరుల నుండి సీబీఐ తీసుకున్న వాంగ్మూలాలు ఒక్కొక్కటీగా బయటకు వస్తున్నాయి. మాజీమంత్రి, జగన్ బాబాయ్ గుండెపోటుతో చనిపోయారని ప్రచారం ప్రారంభించింది ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి, మనోహర్ రడ్డి, శివశంకర్ రెడ్డిలేనని వివేకా ఇంటి పనిమనిషి లక్ష్మీ తెలిపింది. గతంలో ఆమె సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రస్తుతం బయటకు వచ్చింది. శవానికి కట్లు, బ్యాండేజీలు వేయాలని పై నలుగురు చర్చించుకున్నారని తెలిపింది. వివేకా బెడ్ రూమ్ లోని రక్తపు మడుగు, మరకల్ని శుభ్రం చేయలేక తనకు వాంతులు వచ్చాయని తెలిపింది.
హత్య జరిగిన రోజు ఉదయాన్నే తాను వివేకా ఇంటికి వెళ్లానని, లోపలికి వెళ్లి చూసే సరికి ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ మాట్లాడుతూ కనిపించారని వివరించింది. వంట గదిలో వంట మనిషి వివేకా గుండెపోటుతో చనిపోయారని తనకు చెప్పారన తెలిపింది. చాలా చోట్ల ఉన్న రక్తపు మడుగు, మరకలు కనిపించాయని, వాటిని శుబ్రం చేయాలని గంగిరెడ్డి నన్ను ఆదేశించారంది. బెడ్ షీట్ పైనా రక్తపు మరకలు కనిపించాయని తెలిపింది.
వివేకానందరెడ్డిరెడ్డి ఇంట్లో ఉండే పెంపుడు కుక్క ఉండేదని, దాని పేరు జిమ్మి. కొన్నేళ్ళుగా అది వివేకా ఇంట్లో ఉంటుందని చెప్పింది. ఇంటి బయట ఉంటూ ఆ మార్గంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వస్తే వారి వాహనాలను వెంబడించేదని, వివేకా హత్య సంఘటనకు 20-25 రోజుల ముందు జిమ్మి చనిపోయిందని, అప్పుడు ఎలా చనిపోయిందో తెలియదన్నారు. అయితే ఇప్పటి వరకు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో అందరి నోటా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లే వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అవినాష్ రెడ్డిని ఎందుకు సీబీఐ అరెస్టు చేయడం లేదని టీడీపీ వాదిస్తోంది.