ప్రజా పంచాంగంలో ఆర్థిక సంక్షోభం ఖాయంగా కనిపిస్తోంది: యనమల

శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజా పంచాంగంలో ఆర్థిక సంక్షోభం ఖాయంగా కనిపిస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిందని, ప్రజల చేతుల్లోకి రావాల్సిన  ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందన్నారు. సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకుంటున్నారని మండిపడ్డారు. ఆదివారం యనమల ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘పంచాయతీల నిధులు ఒక్క రూపాయి కూడా ఖాతాల్లో ఉంచడం లేదు. పీడీ ఖాతాల్లోకి మళ్లించి ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకుంటున్నారు. ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులపైనా పెత్తనం చేస్తున్నారు. పంచాయతీలకు నిధులు లేకపోతే సర్పంచులు ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు.?

వచ్చిన నిధులు వచ్చినట్టలు లాగేసుకుంటుంటే గ్రామ స్వరాజ్యం ఎక్కడుంటుంది.? గ్రామాలను అబివృద్ధి చేయలేని పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు. నిధుల కోసం ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తే గాంధీ చెప్పిన గ్రాస్వరాజ్యం ఎక్కుడుంది. సొంత మనుషులను వాలంటీర్లుగా పెట్టుకుని ప్రజలతో నేరుగా ఎన్నుకోబడిన సర్పంచులపై జగన్ రెడ్డి పెత్తనం చేస్తున్నారు. గ్రామస్వరాజ్యంలో అభివృద్ధి, పరిపాలన లేకుండా పోయాయి. గ్రామాల గురించి గాంధీ చెప్పిన సిద్ధాంతానికి విరుద్ధంగా రాజారెడ్డి సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు.

పంచాయతీల విధులను మంట గలిపారు. జగన్ రెడ్డి తీరుతో గ్రామ స్థాయిలో నాయకత్వం ఎదగకుండా చేశారు. అన్ని వ్యవస్థల్లో సొంత మనుషులు పెట్టుకున్నారు. ఆ సొంత మనుషులను చెప్పిన చేస్తే కొనసాగిస్తున్నారు..లేదంటే బెదిరించి తొలగిస్తున్నారు. గ్రామ స్వరాజ్యం అని నీతులు చెప్పే వ్యక్తి వాలంటీర్లను ఎందుకు పెట్టాడు.? ప్రజలతో ఎన్నుకున్న సర్పంచులకు నాయకత్వం లేకుండా చేశారు. జగన్ తో నామినేట్ చేసుకున్న వాళ్లకు పెత్తనం ఎలా వస్తుంది’’ అని ప్రశ్నించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *