సుకుమార్ నా ప్రాణం, సర్వస్వం.. సుకుమార్ భార్య తబితా కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుకుమార్ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా సుకుమార్ ఎమోషనల్ అవ్వడం కానీ, ఎక్కువగా మాట్లాడటం కానీ చేయడు. ఇప్పుడు ఆయన పనితనమే కనిపిస్తూ ఉంటుంది. కానీ పుష్ప సినిమా విషయంలో సుకుమార్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. పుష్ప సినిమా సక్సెస్ అయిన సందర్భంగా థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు. తన భార్య తబిత ను తలచుకొని కంటతడి పెట్టేసాడు.

నన్ను భరిస్తున్నందుకు నా భార్య తబితకు థ్యాంక్స్. నా భార్యగా ఈ విషయంలో ఆమెకు కూడా భాగస్వామ్యం ఉంది.. అంటూ సుకుమార్ స్టేజీపైన ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయంపై సుకుమార్ భార్య తబిత స్పందిస్తూ.. తన భర్త పై ఆమెకు ఉన్న ప్రేమను అందరికీ తెలిసేలా ఒక ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.నా పేరుతో నే థ్యాంక్యూని స్టార్ట్ చేసిన నా భర్త, నా సామీ సుకుమార్‌‌ గురించి ఒక్క మాటతో మొదలు పెడతా.. నా ప్రాణం నువ్వు, నా సర్వం నువ్వు.. నా జీవం నువ్వు.. నీలా బంగారం లాంటి మనిషికి భార్యని అయ్యే భాగ్యం దొరికినందుకు ఆ దేవుడికి మొదట థ్యాంక్స్ చెప్పాలి.

ప్రతీ భార్య చాలా కలలు కంటుంది.. తన భర్తతో ఇలా ఉండాలి అలా టైమ్ స్పెండ్ చేయాలి అని.. నిజానికి నా కలలు కొన్ని కలలుగానే మిగిలిపోయినప్పటికీ..నీ కలనే నా కలగా మార్చేసుకున్నా ఈ జీవితానికి.. ఒక విధంగా చెప్పాలి అంటే అది నా అదృష్టమే ఎందుకంటే నీ అంత పెద్ద కలలు కనడం కూడా నాకు రాదు నాకు.. నీతో జీవితం పంచుకున్నందుకు అంత గొప్ప స్థానంలో నువ్వు నన్ను పెట్టినందుకు నీకు నిజంగా మళ్ళీ నా పాదాభివందనం.. ఇట్లు నీ ప్రాణం అంటూ ఆమె ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *