హీరో నిఖిల్‌ ఎమోషనల్‌ పోస్ట్..!

తమకి మంచి జీవితాన్ని అందించేందుకు తన తండ్రి శ్యామ్‌ సిద్ధార్థ్‌ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారని నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్ తెలిపారు. అరుదైన వ్యాధితో కొన్నేళ్లుగా ఇబ్బందిపడుతున్న ఆయన గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ఉదయం నిఖిల్‌ ఓ లేఖ పోస్ట్‌ చేసి భావోద్వేగానికి గురయ్యారు.

Actor Nikhil pens emotional post after his father's demise

‘నా తండ్రి శ్యామ్‌ సిద్దార్థ్‌ మరణంతో కుంగిపోయాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను డాడీ, లవ్‌ యూ. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, ముంబైలో సమ్మర్‌ను ఎంజాయ్‌ చేయడం.. ఇవన్నీ నేను మిస్‌ అవుతాను. నీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు.

“ఆయన మంచి వ్యక్తి. వేలాది మంది విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు చాలా మంది కెరీర్ సెటిల్ అవ్వడానికి గైడ్ చేశారు. తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి కృషి చేశారు. మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఆయన వీరాభిమాని. నన్ను  వెండితెరపై చూడాలనేది ఆయన కల. ఆయనిచ్చిన మోటివేషన్, సపోర్ట్ కారణంగానే నేను ఈరోజు ఇలా ఉన్నాను.  JNTU ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో స్టేట్ టాపర్ ఆయన. హార్డ్ వర్క్ ని మాత్రమే ఆయన నమ్మేవారు. అలాంటి వ్యక్తి అరుదైన వ్యాధి బారిన పడ్డారు. కార్టికో బేసల్ డీజెనరేషన్.. గత 8 సంవత్సరాలుగా ఆయన ఆ వ్యాధితో పోరాడారు. మాతో కలిసి ఉండడానికి తనవంతు కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తు నిన్న ఆయన తుది శ్వాస విడిచారు.నాన్నా.. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా. మీకు కొడుకుగా ఉన్నందుకు నేను ప్రతిక్షణం గర్వపడ్డాను. మనం మళ్లీ కలుస్తామని అనుకుంటున్నా’’ అని నిఖిల్‌ రాసుకొచ్చారు.”

Add a Comment

Your email address will not be published. Required fields are marked *