టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల రామకృష్ణారెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా గోపాలకృష్ణారెడ్డి చేశారు. అటవీ శాఖా మంత్రిగా 2014లో మంత్రిగా చేశారు. వరుసగా ఐదుసార్లు శ్రీకాళహస్తి నుండి విజయం సాధించారు. టీడీపీలో కీలక నేతగా బొజ్జల ఎదిగారు. టీడీపీ తీసుకునే సంచలనాత్మకు నిర్ణయాల్లోనూ బొజ్జల పాత్ర ఉంది. గత కొన్ని రోజులుగా గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో నడిచే వీలు కూడా లేకుండా కుర్చీలోనే కూర్చుంటూ వస్తున్నారు. నోట మాట పడిపోయి కూడా చాలా రోజులు అయింది.

ఆయన ఆరోగ్యం రిత్యా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇటీవల ఆయన జన్మదిన వేడుకలకు కూడా చంద్రబాబు హాజరయ్యారు. తానే స్వయంగా కేక్ కట్ చేయించారు. బొజ్జల మరణంపై టీడీపీ నేతలు, పలువురు రాజకీయ నేతల సంతాపాన్ని వ్యక్తం చేశారు.  బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం బాధాకరం అని, టీడీపీకి తీరని లోటు అని అన్నారు. బొజ్జల కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఫోన్లో కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మానాన్న గారి ఆప్త మిత్రుడు, రాజనీతిజ్ఞుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి బాధాకరం టీడీపీ నేత లోకేష్ అన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ కూడా సంతాపాన్ని తెలిపారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి, పనబాక లక్ష్మీ, కంభంపాటి రామ్మోహన్, బీజేపీ విష్ణువర్థన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, సహా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ రాత్రికి లేదా రేపు సొంతూరుకు బొజ్జల భౌతిక కాయాన్ని తరలించనున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *