మరో వివాదంలో చిక్కుకున్న సన్నీలియోనీ.. ఏకంగా హిందూ సంఘాలే టార్గెట్!
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోనీ తెలిసిన వారు ఎవ్వరూ ఉండరు. ఒక్క బాలీవుడ్లోనే కాదు, భారత్‌లోని యువత మొత్తం ఈ పేరు వినగానే ఒంట్లో కరెంటు పాస్ అవుతుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే… పార్న్ ఫిల్మ్స్ లోనూ నటిస్తుండేంది.. అయితే, మధ్యలో వివాహం జరిగిన తర్వాత నుంచి పార్న్కు పూర్తిగా స్వస్థి చెప్పి.. పిల్లలను కనకుండా దత్తత తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. కొంతమంది ఈ హాట్ లేడీని బూతుగా చూస్తే.. మరికొంత మంది లైఫ్‌కి ఇన్స్పిరేషన్గా భావిస్తారు. అయితే, ఈ అమ్మడుకు వివాదాలు కొత్తేం కాదు.
ఐటెంసాంగ్ భామగా గుర్తింపు పొంది సన్నీ.. ఎప్పుడు సాంగ్ చేసినా.. ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంటుంది. ఇటీవలే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా, ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో నటించింది. కనికా కపూర్ పాడిన ఈ పాటకు సన్నీ హాట్ స్టెప్పులేస్తున్న వీడియో బుధవారం విడుదలైంది. ఈ సాంగ్‌లో సన్నీ అందం అందర్నీ ఎప్పటిలాగే ఆకర్షించింది. అయితే, ఈ పాటపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ పాటలో లిరిక్స్ హిందువల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. రాధా మధుబన్ అంటూ సాగిన ఈ సాంగ్‌లో రాధను అవమానించారని ఎగిసిపడుతున్నారు. రాధా కృష్ణుడికి భక్తురాలే కానీ.. నర్తకి కాదని.. మధుబన్‌లో రాధ ఎలా నృత్యం చేస్తుందని విమర్శించారు. ఈ లిరిక్సని వెంటనే మార్చాలని.. డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదంతో వీడియో మరింత వైరల్‌గా మారింది.