ఫోక‌స్ చిత్రం నుంచి సుహాసిని పోస్టర్ రిలీజ్.. నెట్టింట్లో వైరల్!

Focus Movie: అషూ రెడ్డి బిగ్ బాస్ కంటే ముందు ఛల్ మోహన రంగ అనే సినిమాలో నటించింది. కానీ ఆమెకు తగిన గుర్తింపు అందలేదు. ఈమె బిగ్ బాస్ షోతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందింది. బిగ్ బాస్ తర్వాత ఆమె యాంకర్ గా రాణిస్తున్న సమయంలో ఫోకస్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది.

 Focus Movie
Focus Movie

ఈ సినిమాలో విజయ్ శంకర్, అషూ రెడ్డి హీరోహీరోయిన్లు. సూర్య తేజ దర్శకత్వం వహిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయిన ఫోకస్ చిత్రం తాలూకు స్పెషల్ పోస్టర్ ను ప్రేమికుల దినోత్సవం రోజున రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ పోస్టర్ లో అషూ రెడ్డి రొమాంటిక్ యాంగిల్ లో కనిపిస్తూ కుర్రకారుల మనసును దోచుకుంటోంది.

త్వరలో ఈ మూవీ టీజర్ ను విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో విజ‌య్ శంక‌ర్, అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ కనిపించబోతున్నారు. విజ‌య్ శంక‌ర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, సుహాసిని, మణిరత్నం జడ్జి పాత్రలో కనిపించబోతున్నారు.

అలాగే భాను చంద‌ర్‌, షియాజీ షిండే, జీవా, సూర్య భ‌గ‌వాన్ ఇతర ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరమైన కథాకథనాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఈ చిత్రం తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీని మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉత్కంఠ‌భ‌రిత‌మైన స్క్రీన్‌ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రంలో అషూ రెడ్డి అందాల ఆరబోతతో రొమాంటిక్ గా కనిపిస్తుందని కథనం. సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర ద‌ర్శ‌కుడు సూర్య‌తేజ తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *