సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి ఇవ్వాలి : మాజీ ఎంపీ హర్షకుమార్

సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని, అనంతబాబు.. గంజాయి, మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారని అనకాపల్లి మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. రూబీ రాళ్ల ఎగుమతి రహస్యం సుబ్రహ్మణ్యంకు తెలుసన్నారు. తన అక్రమాలను అందరికీ చెబుతున్నాడనే అనంతబాబు హత్య చేశారని ఆరోపించారు.  సీఎం జగన్‍కు ఎమ్మెల్సీ అనంతబాబు బినామీ బినామీ అని విమర్శించారు. మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే ద్వారంపూడికి అనంతబాబు బినామీ అని దుయ్యబట్టారు. అనంతబాబును ప్రశ్నించేందుకే పోలీసులు భయపడ్డారని, అందుకే పోలీసులు అనంతబాబును అరెస్టు చేయడం లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా సుబ్రహ్మణ్యం హత్య కేసులో అధికార ప్రతిపక్షా మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఫోన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. కుటుంబానికి రూ.5 లక్షల సాయం ప్రకటించారు. కళ్ల ముందు నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు పెళ్లిళ్లకు వెళ్తున్నా అరెస్ట్ చేయకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. టీడీపీ, దళిత సంఘాల పోరాటం వల్లే సుబ్రమణ్యం మృతిని హత్య కేసుగా నమోదు చేశారని, తన భర్త సుబ్రహ్మణ్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అపర్ణ కోరుతున్నారన్నారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగేవరకు టీడీపీ తరపున పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుభ్రమణ్యంది ముమ్మాటికీ హత్యేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అందుకే పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారని తెలిపారు. వారి కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ హత్యను ప్రతి పక్ష రాజకీయ చేయడం తగదని, దళితులను రెచ్చగొట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *