నోటి వాటానికి చేతి వాటానికి పోటీ… అసలేంటి వీళ్ల కథ..!

యువ హీరో సంతోష్‌ శోభన్‌, వర్ష జంటగా నటించిన మూవీ ’శ్రీదేవి శోభన్​బాబు’. వర్షం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ సినీరంగంలో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్ప‌ర‌చుకొనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ మధ్య మారుతి దర్శకత్వంలో మంచి రోజులోచ్చాయి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించగా.. తాజాగా ‘శ్రీదేవి శోభన్​బాబు’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి, రామ్ చరణ్ చేతుల మీదుగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

Sridevi shoban babu movie trailer out

‘‘కథలో ముఖ్యాంశాలు.. హీరోకి నోటివాటం ఎక్కువ. హీరోయిన్‌కి చేతివాటం ఎక్కువ. వీళ్లిద్దరి మధ్య ఒక ఛాలెంజ్‌. గెలిచే సమయానికి ఒక సమస్య. ఉత్కంఠగా సాగుతున్న కథలో మనసుని హత్తుకునే సన్నివేశాలు, మరెన్నో విశేషాలతో త్వరలో మీ అభిమాన థియేటర్‌లో ‘శ్రీదేవి శోభనబాబు’ చిత్రప్రదర్శన’ అంటూ వాయిస్‌ ఓవర్‌తో సాగే ఈ ట్రైలర్‌లో అన్నివిధాలుగా ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, సెంటిమెంట్‌, ఫైట్స్‌, లవ్‌.. ఇలా అన్నిరకాల ఎమోషన్స్‌ని ఈ ట్రైలర్‌లో చూపించారు. రెండు విభిన్న ధృవాల వంటి హీరోహీరోయిన్లు సంతోష్ శోభన్, గౌరీ కిషన్ ప్రేమలో పడడం ఆసక్తికరంగా మారింది. ఆ తరువాత ఆమెను ఇంటికి తీసుకెళ్లగా, శోభన్ కు అక్కడే సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య ఏమిటి? అసలేం జరిగింది? వీరిద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది ? మళ్లీ ఎలా ఒక్కటయ్యారు? అనేది వెండితెరపై చూడాల్సిన కథ.

ఈ సినిమాలో నాగబాబు, రోహిణి కీలకపాత్రలు పోషించారు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల ‘గోల్డ్ బ్యాక్స్ ఎంటర్‌టైన్మెంట్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *