F3 నుంచి ‘ఊ..ఆ..ఆహా..ఆహా’ సాంగ్ విన్నారా..!

విక్టరీ వెంకటేశ్ – మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా ‘ఎఫ్ 3’ సినిమా రూపొందింది. అనిల్‌ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 2019 లో సంక్రాంతికి విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధించిన ‘ఎఫ్‌2’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌గా సునీల్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌ సాంగ్‌కి మంచి స్పందన విచ్చింది.

special song out from F3 movie

తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ‘ఊ ఆ అహ అహ’ అనే పాటను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సునిధి చౌహాన్ .. లవిత లోబో .. సాగర్ .. అభిషేక్ ఆపించారు. ప్రధానమైన జంటలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ ఇది. ‘ఎఫ్ 3’ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహరీన్ కౌర్ నటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ‘ఎఫ్ 2’ సినిమాలో ఈ జోడీలు ఆకట్టుకున్నాయి. మరోసారి ‘ఎఫ్ 3’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ‘ఎఫ్ 2’లో ‘గిర్రా గిర్రా…’ పాటకు మించి అనేలా ‘ఊ ఆ ఆహా ఆహా’ సాంగ్ ఉంది. ఈ పాటలో తమన్నా .. మెహ్రీన్‌తో పాటు సోనాల్ కూడా మెరవడం విశేషం. మాస్ ఆడియన్స్ కోసం దేవిశ్రీ చేసిన ఈ ట్యూన్ వాళ్లకి కనెక్ట్ అయ్యేలానే ఉంది.

దిల్‌ రాజు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *