సొంత బాబాయిని చంపిన వ్యక్తి నన్ను చంపడా.? : చంద్రబాబు
చెత్తపై పన్ను వేసిన ఈ ప్రభుత్వాన్ని చెత్తలో కలిపేస్తామని, బాదుడే బాదుడు ఆగాలంటే ఈ ప్రభుత్వం దిగాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ జెండా ఎగరాలని, బొత్సకు మద్యం వ్యాపారం తప్ప ఏమీ తెలియదన్నారు. నెలిమర్లలో రోడ్ చేసిన ఆయన వైసీపీపై నిప్పులు చెరిగారు. ‘‘అమ్మఒడి కాదు.. అరాకొరా ఒడని, టీచర్లకు మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేసినప్పుడే.. రాష్ట్రం పరువు మంటలో కలిసి పోయింది. నిజాయితీపరుడైన అశోక్ గజపతిరాజుపై కేసులు పెట్టారు. ఎన్నిరకాలుగా వేధించినా అశోక్‌గజపతిరాజు ధైర్యంగా నిలబడ్డారు. అన్ని ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు.
కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరిగాయని వైసీపీ దొంగల్ని పట్టుకోండి. ఇది దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం. ఉత్తరాంధ్రపై విజయసాయి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి?. మనం పోరాడితేనే విధ్వంసం ఆగుతుంది. పోరాడకపోతే బాదుడే బాదుడు కొనసాగుతుంది. ఇది చెత్త ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం. ఓటీఎస్ ఎవ్వరూ కట్టొద్దు.. టీడీపీ సర్కార్ వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం. గతంలో ఎప్పుడైనా ఇంత తక్కువ రిజల్ట్ టెన్త్ లో వచ్చిందా?. జగన్ నాడు-నేడు అంటూ రంగులు కొట్టారు.. రంగులు కొడితే చదువు వస్తుందా?. దద్దమ్మ ముఖ్యమంత్రి, మంత్రి వల్ల పిల్లలు ఫెయిలయ్యారు.
మళ్లీ పరీక్ష రాసేందుకు పేపర్‌కు వెయ్యి రూపాయలట. ఈ చెత్త వైసీపీ మన పిల్లల భవిష్యత్‌తో ఆడుకుంటోంది. ఈ ముఖ్యమంత్రి భవిష్యత్ అంధకారం చేస్తున్నారు. మద్యంపై విపరీతంగా రేట్లు పెంచారు. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఆడబిడ్డల తాళిబొట్టును తాకట్టుపెట్టిన సీఎం జగన్‌రెడ్డి. వివేకాది ముందు గుండెపోటు.. ఆ తర్వాత గొడ్డలిపోటు అయ్యింది. తల్లికి మోసం.. చెల్లికి మోసం. సాక్షులు ముగ్గురు చనిపోయారు.. సీబీఐని బెదిరిస్తున్నారు. బాబాయిని చంపినవారు.. మిమ్మల్ని, నన్ను చంపరా?’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.