కోడి గుడ్డు తిన్న తర్వాత మీరు ఈ పదార్థాలు తింటున్నారా అయితే ఎంత ప్రమాదమో చూడండి!
Egg: ఈ మధ్యకాలంలో చాలామంది కోడుగుడ్డును తరచూ తింటున్నారు. బాడీ ను పెంచే క్రమంలో ఈ గుడ్డు ను ఆహారంగా మరింత ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ గుడ్డును ఉడికించడం తక్కువ సమయం పడుతుంది కాబట్టి గుడ్డును పిల్లలకు ఆహారంగా పెట్టడానికి తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.
ఇక ఈ గుడ్డు తిన్న తరువాత కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోకూడదు అని తెలుస్తుంది. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోడి గుడ్డు తిన్న తర్వాత పాలు, పెరుగు, జున్ను, చేపలు వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. కోడి గుడ్డు తిన్న తర్వాత ఈ ఆహార పదార్థాలలో ఏ ఒక్కటి కూడా వెంటనే తీసుకున్న మన శరీరంలో జీర్ణ సమస్యలు ఎదురు పడుతుంది.
అలాగే కోడిగుడ్డును తీసుకున్న తర్వాత తేనె నెయ్యి వంటి ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది కాదు. వీటితో పాలు, అరటిపండు వంటి ఆహారా పదార్ధాలు తీసుకుంటే అనేక జీర్ణ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వీటిని తీసుకోవాలి అనుకుంటే ఒక గంట సమయమైన గ్యాప్ ఇవ్వాలి.
ఇక కోడి గుడ్డును తిన్న తరువాత ద్రాక్ష, పుచ్చకాయ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి మంచిది కాదు. అంతేకాకుండా ఈ గుడ్డు తిన్న తర్వాత పండ్లను తీసుకోవడం మంచిది కాదు అని తెలుస్తుంది. పైన ఉన్న ఆహార పదార్థాలు ఏలాంటి కాంబినేషన్ లో తీసుకున్న ఎసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి అని తెలుస్తుంది.