Health Tips: పేపర్ కప్స్ లో టీ తాగుతున్నారా అయితే ఎంత ప్రమాదమో చూడండి!
Helath Tips: గత కొంత కాలంగా చీప్ అండ్ బెస్ట్ అని అందరూ ఫంక్షన్లలో, పెళ్లిళ్లలో, బయట టీ స్టాల్స్ లో పేపర్ కప్స్ ఉపయోగిస్తున్నారు. అంతేకాక తాగే వారు కూడా దీనికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ ఇవి మన శరీరానికి మాత్రం హాని చేస్తాయని చెప్పవచ్చు. పేపర్ కప్స్ వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పేపర్ కప్పులలో కాఫీ, టీ ఇతర పానీయాలు తాగితే మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు హాయ్ చెప్పినట్టే అని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. డిస్పోజబుల్ గ్లాసులులో మూడు సార్లు 100 మీ. లీ. లెక్కన వేడిగా ఉండే టీ తాగడం వలన 70 వేల సూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు శరీరం లోకి ప్రవేశిస్తాయని పరిశోధకులు తెలుపుతున్నారు.
80నుంచి90 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడితో ఉన్న 100 ఎం. ఎల్. ద్రవపదార్థం ద్వారా 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్ కారణాలు మన శరీరంలోకి వెళతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కుదరని సమయాల్లో తప్ప మిగతా సమయంలో ఆ కప్పులో టీ తాగకపోవడమే మంచిది. లేదంటే మీరు అనారోగ్యం అక్షరాల కొని తెచ్చుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.
వీటివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేగాక మెత్తనైన, తేలికైన ఈ ప్లాస్టిక్ లో డెన్సిటీ పాలిథిలిన్ ఎక్కువగా ఉండడం వల్ల సాధారణ సమయాల్లో ఈ పేపర్ కప్పుల్లో రీసైక్లింగ్ కొంచెం కష్టం అవుతుంది. కొన్ని ప్రత్యేక పద్ధతులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది.