మా పేర్లు చెప్పి హగ్గులు తీసుకుంటున్నారు అంటూ.. హైపర్ ఆది!

Hyper Aadi: బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అతి తక్కువ సమయంలో సిల్వర్ స్క్రీన్ పై మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు ఆది. ఇక అందరూ టైమింగ్ కామెడీ నమ్ముకుంటే.. తను కొత్త వే లో పంచింగ్ కామెడీ ని నమ్ముకున్నాడు. ఇక పలు సినిమాల్లో కూడా సైడ్ ఆక్టర్ గా నటిస్తూ బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అది.

Hyper Aadi
Hyper Aadi

ఇదిలా ఉంటే ఆది జానీ మాస్టర్ పై తనకున్న కడుపు మంటను బయటపెట్టాడు. ఢీ షో లో హైపర్ ఆది ప్రియమణి తో చేసే హడావిడి మనకు తెలుసు. ఇక కొత్తగా ఇదే క్రమంలో నందిత శ్వేత ని కూడా అసలు ఏమాత్రం వదలడం లేదు. ఇదే క్రమంలో ఒక హాగ్ ఇవ్వాల్సిందే అంటూ నందిత, ప్రియమణి ల దగ్గరకు వెళ్ళాడు.

కానీ ఈ లోపు జానీ మాస్టర్ ప్రియమణి, నందిత ల వద్ద హగ్గులు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దాంతో హైపర్ ఆది కడుపు మండి పోయి ఈ విధంగా విరుచుకుపడ్డాడు. ‘మా పేర్లు చెప్పుకొని ఎన్ని హగ్గులు తీసుకుంటారు’ అని తనలోని ఉన్న జలసీను ని బయట పెట్టాడు.

ఇక జానీ మాస్టర్ కూడా ఆ మాటలకు ఏ మాత్రం తగ్గకుండా తనదైన శైలి స్టైల్ లో ఏ మాత్రం తగ్గకుండా రిప్లై ఇచ్చాడు. ‘ మీకైతే ఇవ్వరు.. నాకు చూసావా! ఎలా హగ్గులు ఇస్తున్నారో అని అన్నట్టుగా వాళ్ళిద్దరి దగ్గర హగ్గులు రిసీవ్ చేసుకుంటూ జానీ మాస్టర్ ఓ రేంజ్ లో హైపర్ ఆది కి కౌంటర్ ఇచ్చాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *