సుశాంత్ ను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్న రియా చక్రవర్తి!

Riya Chakraborty And Sushant: సినీ ప్రియులకు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ బుల్లితెర ద్వారా పరిచయమైన ఈ క్యూట్ హీరో ఆ తర్వాత ‘ఎం.ఎస్.ధోని’ సినిమాలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకొని బాలీవుడ్ స్టార్ హీరోలలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలిగాడు.

Riya Chakraborty And Sushant
Riya Chakraborty And Sushant

ఆ తర్వాత వచ్చిన చిచోరే, దిల్ బెచారా సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా స్టార్ హోదా లో ఆల్ట్రా లెవల్ లో దూసుకుపోతున్న ఈ కుర్రహీరో కి ఏమైందో.. తెలియదు కానీ ఆత్మహత్య చేసుకుని తన ఫ్యాన్స్ కి కన్నీటిని ఇచ్చి ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయాడు. సుశాంత్ చనిపోయి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఫ్యాన్స్ అతని మరణాన్ని ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేక పోతున్నారు.

ఇక నిన్న అనగా శుక్రవారం రోజున సుశాంత్ 36 వ పుట్టినరోజు సందర్భంగా అతని అభిమానులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఈ క్రమంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా సుశాంత్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా లో వీడియో పంచుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

గతంలో వారిద్దరూ కలిసి జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసి ‘మిస్ యు సో మచ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సుశాంత్ తో దిగిన ఫోటోలకు లవ్ ఎమోజిని టాగ్ చేసి తన ఇన్ స్టా స్టోరీ లో కూడా పంచుకుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *