Red rice: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బెస్ట్ మార్గం రెడ్ రైస్..!
Red rice: కరోనా కారణంగా ఇటీవల కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఇందుకోసం వారు తీసుకునే ఆహారం విషయంలో ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. మందులకు బదులు నేచురల్ గా ఇమ్యూనిటీని పెంచుకునేందుకు రకరకాల ఆహారపదార్ధాలు తీసుకుంటున్నారు. తీసుకునే ఆహారంలో కూడా మార్పులూ చేర్పులూ చేసుకుంటున్నారు. రోజు వారిగా తీసుకునే ఆహారంలో భాగమైన అన్నంలో కూడా చాలా మార్పులు చేస్తున్నారు. పాలిష్ చేసిన బియ్యం స్ధానంలో రెడ్ రైస్ ను తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. చాలా మందికి ఈ రెడ్ రైస్ గురించి తెలియకపోవచ్చు. అయితే ఈ రెడ్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ప్రస్తుతం వైద్యులు సైతం ఈ రెడ్ రైస్ ను ఆహారంగా తీసుకోమని రోగులకు సూచిస్తున్నారు. దీనిలో ఉండే యాంటోసైనిన్ల వల్ల దీనికి ఈ రంగు వచ్చింది. పాలిష్ చేయబడిన రైస్ వెరైటీస్ కంటే ఈ రెడ్ రైస్ లో న్యూట్రిషనల్ విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ కంటెంట్ ఉండదు. దీన్ని తినడం వలన బరువు పెరుగుతారేమోనన్న భయం అసలు అవసరం లేదు. రెడ్ రైస్ లో విటమిన్లు అలాగే ఐరన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ రెండూ శరీరంలోని రక్తకణాల వృద్ధిని పెంచుతాయి. దాంతో, స్కిన్ హెల్తీగా మారుతుంది. ఇందులో ఉండే విటమిన్, ఐరన్ లు శరీరంలోని ఎర్ర రక్త కణాలు కాపాడుతాయి. రెడ్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. చర్మం పై ముడతలు, వృద్ధాప్య ఛాయలు పోగొడతాయి.
ఇందులో ఉండే సెలీనియం అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. రైస్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫ్రీ రాడికల్స్ పై పోరాటం జరుపుతాయి.కాబట్టి వృద్ధాప్య ఛాయలు అనేవి రావు. రెడ్ రైస్ లో మ్యాంగనీస్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి డయాబెటిస్ పేషంట్స్ కు అవసరం. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచేందుకు ఇది అవసరం. రెడ్ రైస్ ను తీసుకునే వారిలో ఎముకలు బలంగా మారుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం బోన్స్ ను హెల్తీగా ఉంచేందుకు దోహదపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ. అలాగే ఫ్యాట్ కంటెంట్ ఉండదు. బరువు తగ్గాలనుకునే వారు రెడ్ రైస్ అన్నం తీసుకోవటం మంచిది. రెడ్ రైస్ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.