బాలీవుడ్‌లో స్పెషల్‌ సాంగ్‌కి స్టెప్పులు వేయనున్న రష్మిక?

ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా.. వాటన్నింటినీ మించి డామినేట్ చేసేది.. సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది స్పెషల్ సాంగ్. ఈమధ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చెయ్యడంతో సినిమా లుక్కే మారిపోతోంది. జనాలకు కూడా ఎక్స్ పెక్ట్ చేసినంత కిక్కిస్తోంది. సినిమాకు హీరో, హీరోయిన్లతో పాటు.. స్పెషల్ సాంగ్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.ఇప్పటికే  జనతా గ్యారేజ్‌లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా,ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్‌తో మెరుపులు మెరిపించారు. ఇప్పుడు నేషన్ క్రష్ రష్మిక వంతు వచ్చింది. ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఆమె దగ్గరికి రిక్వెస్ట్ వెళ్లిందట.

Rashmika mandanna ready for special song in bollywood

అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించి, అదే సినిమాను బాలీవుడ్‌లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ వంగా.. ఇప్పుడు రణబీర్ కపూర్‌తో ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. పరిణీతి చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ కాగా.. ఓ స్పెషల్ సాంగ్ కోసం రష్మికను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారట.

Rashmika mandanna ready for special song in bollywood

పుష్పతో బాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది రష్మిక. ఇప్పటి వరకు సౌత్ లోనే రష్మిక హవా కనిపిస్తూ వచ్చింది. పుష్పతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. జూన్ 10న రష్మిక నటించిన తొలి హిందీ చిత్రం మిషన్ మజ్ను రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత అమితాబ్ తో కలసి నటించిన గుడ్ బై మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఇప్పుడు యానిమల్ మూవీలో రణభీర్‌తో రష్మిక స్టెప్పులేస్తే మాత్రం బీటౌన్‌లో ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *