ఆర్జీవీ సినిమా స్క్రీనింగ్ కి ‘నో’ చెప్పిన పీవీఆర్,ఐనాక్స్
సంచలన దర్శకుడు ఆర్జీవీ తన సినిమాలతోనో, తన ట్వీట్స్తోనో ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆర్జీవీ ‘డేంజరస్’ అనే మూవీని తెరకెక్కించారు. ఒక లెస్బియన్ లవ్ స్టోరీతో యాక్షన్, క్రైం అంశాలని కలిపి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధానపాత్రలో నటించారు. ‘డేంజరస్’ సినిమాని ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించి ఇప్పటికే ఓ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇండియాలో తొలి లెస్బియన్ సినిమాగా ‘డేంజరస్’ విడుదల కాబోతుంది.
మొదటి నుంచి ఇద్దరి అమ్మాయిల రొమాన్స్‌ను హైలైట్ చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేశారు ఆర్జీవీ. ట్రైలర్‌ను కూడా చాలా బోల్డ్‌గా కట్ చేశారు. ఏప్రిల్ 8న సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో వర్మకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాను స్క్రీనింగ్ చేయడానికి పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ తిరస్కరించాయి.
. @_PVRcinemas , @INOXCINEMAS refusing to screen my film KHATRA (DANGEROUS) becos it’s theme is LESBIAN ,and this after Supreme Court repealed section 377 and censor board already passed .it is a clear cut ANTI stand of their managements against #LGBT community pic.twitter.com/GxoHDH7Tjw
— Ram Gopal Varma (@RGVzoomin) April 5, 2022
ఈ వివాదంపై ఆర్జీవీ ట్విట్టర్లో స్పందించారు. ఈ వివాదంపై ట్వీట్ చేస్తూ.. ”నా సినిమా డేంజరస్ ని లెస్బియన్ కథాంశం అని దాన్ని ప్రదర్శించడానికి నిరాకరించడం సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమే. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం LGBT కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నారు. PVR, ఐనాక్స్ యాజమాన్యాలు LGBTని వ్యతిరేకిస్తున్నారు. LGBT కమ్యూనిటీ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ వారి నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. వారి వ్యతిరేక LGBT, మానవ హక్కులను అవమానించడమే” అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఈ సినిమా రిలీజ్ కోసం పోరాడతామంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకోమని సలహాలు ఇస్తున్నారు. మరి వర్మ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
I request not only the #LGBT community but also everyone to stand up against the management of @_PVRcinemas and @INOXCINEMAS for their ANTI #LGBT stand ..This is an insult to human rights pic.twitter.com/HgaIYw9mbA
— Ram Gopal Varma (@RGVzoomin) April 5, 2022