పుష్ప సినిమాలో ఆ సీన్​ డిలీట్​.. ఫ్యామిలీ ఆడియన్స్ కోసమేనట?

సుకుమార్​ దర్శకత్వంలో  ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. నిన్న ప్రపంచవ్యాప్తంగా 3వేలకుపైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సీఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. సినిమా రివ్యూ పరంగా మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. పుష్పరాజ్​గా బన్నీ ఇరగదీస్తే.. శ్రీవల్లిగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది రష్మిక.  సినిమలా యాక్షన్స్​ సీన్స్​కు ఎంతగా అరుపులొచ్చాయో.. వీరిద్దరి లవ్​ట్రాక్​లోనూ అంతే క్రేజ్​ వినిపించింది.

allu arjun pushpa movie creating records in us premier shows collection

అయితే, ఫ్యామిలీ ఆడియయ్స్ ఈ సినిమాలోని ఓ సీన్​ దగ్గర బాగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. శ్రీవల్లి, పుష్పరాజ్​ వ్యాన్​లో రొమాన్స్ చేసుకుంటారు. అలా అనుకోకుండా పుష్పరాజ్​ శ్రీవల్లి ప్రైవేట్​ పార్ట్​ను తాకినట్లు చూపిస్తారు. దీన్ని చూసిన ఫ్యామిలీ ఆడియన్స్.. సుకుమార్​ మార్క్​లో ఇది ఊహించలేదని తొలిరోజు రివ్యూలో చెప్పారు. దీన్ని దృష్టిలోకి తీసుకున్న సుక్కూ.. ఆ సీన్​ను తీయేలని నిర్ణయించుకున్నారట. ఆదివారం నుంచే ఆ సీన్​ లేకుండా సినిమా ప్రదర్శించనున్నట్లు సమాచారం.

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం ఇరగదీశారు. అదిరిపోయే మాస్​ బీట్​తో ఆకట్టుకున్నాడు. ఇక స్పెషల్​గా ఐటెం సాంగ్​లో కనిపించిన సమంత క్యూట్​ హాట్  ఎక్స్​ప్రెషన్స్​తో కుర్రాళ్ల మతి పోగొట్టింది. సునీల్​, అనసూయ తమ తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయినట్లు కనిపిచింది. మిగిలిన వారు కూడా సినిమాకు మంచి విజయాన్ని అందించడంలో తీవ్ర కృష్టి చేశారు. కాగా, సంక్రాంతికే ఈ సినిమా ఓటీటీ వేదికైన అమెజాన్​లో స్ట్రీమింగ్​ కానున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *