పాముతో సరసాలు.. చివరికి ఏం జరిగిందంటే?

snake : సాధారణంగా పామును చూసి మనుషులు చాలా భయపడతారు. కానీ ఆ పాము మనుషులు చూసి కూడా అంతే భయపడుతుందని చెప్పవచ్చు. మనుషులు తనను ఏమైనా చేస్తారేమో అని పాములు ముందుగా కాటు వేయడానికి ప్రయత్నిస్తాయి. ఆ విషయం తెలిసి కూడా ఒక ఆకతాయి ఒక పాముతో సరసాలు ఆడాడు.

snake
snake

ఓ కుర్రాడు చేసిన ఆకతాయి పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ కుర్రాడు ఒక పాముని చేత్తో పట్టుకున్నాడు. అది నోరు తెరుచుకుని భయంకరంగా ఉంది. కానీ అతను ఏమాత్రం భయపడకుండా మొబైల్ వీడియో రికార్డు అవుతుందో లేదో చూసుకుంటూ.. ఆ పాము పై నోటితో ముద్దు పెట్టినంత ఫీలింగ్ తో ఊదుతున్నాడు.

చివరిగా ఆ పాము తలను తన తలపై పెట్టుకున్నాడు. ఆ పాము ఇంకెక్కడ ఆగుతుంది. అతని తలను గట్టిగా నోటితో కరుచుకొని పట్టుకుంది. ఆ వ్యక్తి పామును వదిలించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ పాము తలను గట్టిగా పట్టుకోవడంతో ఎంత లాగినా ఊడి రాలేదు. అలా అతను లబోదిబో అంటున్నాడు.

చివరికి పాము వదులుతుందా లేదా అని చూసే సమయానికి వీడియో ముగిసింది. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో @ఫాలికా అనే ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియోను డిసెంబర్ 6న పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూ.. తెగ హడావిడి చేస్తోంది. మరి మీరెందుకు ఆలోచిస్తున్నారు మీరూ ఓ లుక్కేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *