పవన్ లా మాట మార్చితే ప్రజలు చెప్పుతో కొడతారు : మంత్రి పేర్ని నాని

పవన్ కల్యాణ్ హాబీగా రాజకీయాలు చేస్తాడని,  పవన్ మాటకు నిబద్ధత ఉందా.. మాటకు కట్టుబడ్డాడా? అని సమాచార శాఖా మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ లా మాట మార్చితే ప్రజలు చెప్పుతో కొడతారని తీవ్రంగా విమర్శించారు. మంత్రులు రాజీనామా చేసిన అనంతరం తన విధిలో భాగంగా పేర్ని నాని చివరి సారిగా కేబినెట్ నిర్ణయాలను గురువారం వినిపించారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబును కలిశాను అంటాడు.. ఆయనేమన్నా ఎన్నికల కమిషనరా అని ప్రశ్నించారు. పార్టీ పెట్టి చంద్రబాబును కలవడం ఎందుకన్నారు. పవన్.. చేగువీరా, పూలే అందరూ అయిపోయారు.. ఇప్పుడు చంద్రబాబు ఫొటో పెట్టుకున్నాడన్నారు.

పవన్ కు చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం ఉందని, 2014లో పవన్ ఎవరి పల్లకి మోశాడని ప్రశ్నించారు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ నెల 22న వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం నగదు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. 8 మండలాలతో పులివెందుల, 7 మండలాలతో కొత్తపేట రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు.

పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ లో కొత్తగా 12 ఉద్యోగాలకు,  ఏపీ మిల్లెట్ మిషన్ యాక్ట్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. ఉన్నత విద్య కోసం 253 పోస్టులకు, తగరపువలస డిగ్రీ కాలేజ్ కోసం భవనాలు, పోస్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంకా ఏం నిర్ణయాలు తీసుకున్నారంటే…ప్రకాశం జిల్లా దర్శి డిగ్రీ కాలేజ్ లో 34 టీచింగ్ పోస్టుల మంజూరుకు ఆమోదం. హెల్త్ హబ్స్ కోసం కార్పొరేషన్స్ లో భూములు కేటాయింపు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టిస్ చేయకుండా నియమ నిబంధనల తయారీకి కేబినెట్ ఆమోదం తెలిపందన్నారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *