నాతో ఫైట్ కు రా పవన్..లోకేష్ ఓ బఫూన్ : డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కాదు.. దమ్ముంటే నాతో ఫైట్ చేయగలవా.? అని సవాల్ విసిరారు. 70 ఏళ్ల వయసున్ననాతో ఫైట్ చేయాలని అని అన్నారు. శ్రీకాకుళంలో జిల్లా టెక్కలిలో ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సింహంలాంటి వ్యక్తి. ఎంత మంది వచ్చినా ఏమీ చేయలేరు. జగన్ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఉన్నారు. సినిమాలో పవన్ కల్యాణ్ ఒకేసారి 50 మందిని కొడితే పడిపోతారు.
దాన్ని నిజం అనుకుంటున్నారా.? సినిమాలో కాదు నాతో ఫైట్ కు రమ్మనండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు. ఇవన్నీ మాట్లాడటానికే బాగుంటాయని.. వాస్తవికత కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిస్తానని బఫూన్ లాంటి లోకేష్ అంటున్నారని ఎద్దేవా చేశారు. మా జగన్మోహన్ రెడ్డి సింహాం లాంటి వ్యక్తి అన్నారు. రాష్ట్రానికి జగన్ రారాజులా ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారని పేర్కొన్నారు. జగన్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీఠ వేస్తూ..జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని కొనియాడారు. అదే సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ, టెక్కలి ఇంఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్నాయుడుకు వార్నింగ్ ఇచ్చారు. టెక్కలిలో శిలా ఫలకాన్ని తామే కూల్చామని ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో కిల్లి కృపారాణి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వేసిన శిలాఫలకాలను టీడీపీ నాయకులు ధ్వసం చేశారని ఆరోపించారు. సభలో దువ్వాడ ఆవేశంతో ఊగిపోవడంతో ధర్మాన హెచ్చరించడంతో ఆయన ప్రసంగాన్ని ఆపేశారు.