నలుగురు పెళ్లాల ముద్దుల మొగుడు పవన్ : మంత్రి అమర్నాథ్

పవన్ కళ్యాణ్ నలుగురు పెళ్లాల ముద్దుల మొగుడని మంత్రి గుడివాడ్ అమర్నాథ్ అన్నారు. పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ ని అడిగితే పవన్ వ్యక్తిత్వాన్ని గురించి చెప్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చింతలపూడిలో శనివారం వైసీపీ నాయకులపై పవన్ చేసిన వ్యాఖ్యలకు అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని గురించి టీవీ చర్చల్లో రేణూ దేశాయ్ చాలా సార్లు చెప్పిందన్నారు. సొంతింటి మనుషులే ఆయన గురించి చెప్తే ఇక మేమేం చెప్పాలని విమర్శించారు. ఉన్న ముగ్గురు భార్యల్లో ఒకరు లోకల్, మరొకరు నేషనల్, ఇంకొకరు  ఇంటర్నేషనల్ అని దుయ్యబట్టారు. నలుగురు పెళ్లాలున్న పవన్ తమ నాయకుడు జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

పవన్ చంద్రబాబు దత్తపుత్రుడేనని  అన్నారు. చంద్రబాబు ఆశల కోసం ఈ దత్త పుత్రుడు పనిచేస్తున్నారన్నారు. టీడీపీ ఎన్నికలో ఇచ్చిన ఏ హామీ నిలబెట్టిన దాఖలాలు లేవని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన టీడీపీకి పవన్ కళ్యాణ్ అండగా నిలబడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఆ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని ఎన్టీఆర్ చెప్పేవారు. అలాంటిది మొన్న కాంగ్రెస్ తో పొత్తుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని ఉద్దరించడానికి పుట్టిన మనిషిలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలిసే 2019 ఎన్నికలో అఖండ మెజారిటీ సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు. సొంత పుత్రుడు లోకేశ్‌పై నమ్మకం లేకపోవడంతోనే.. దత్తపుత్రుడిని చంద్రబాబు నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. అన్ని పాపాలు చేసిన చంద్రబాబుపై పవన్‌కు ఎందుకు అంత ప్రేమో అర్థం కావడం లేదన్నారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *