పద్మా.. నువ్వు ఓరేయ్ అంటే మేము ఒసేయ్ అనలేమా.? : బోండా ఉమా

వాసిరెడ్డి పద్మపై బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు  చేశారు. వాసిరెడ్డి పద్మ బజారు మనిషిలా మాట్లాడుతోందని మండిపడ్డారు. వాసిరెడ్డి పద్మ అరేయ్ అంటే మేము ఒసేయ్ అనలేమా అంటూ మండిపడ్డారు. జగన్ ను వాసిరెడ్డి పద్మ రోడ్డున పడేసిందని ఆరోపించారు.  సోమవారం బోండా ఉమ సహా టీడీపీ నేతలు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వాసిరెడ్డి పద్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో అత్యాచారం జరిగిన వెంటనే చంద్రబాబు సహా టీడీపీ నేతలు పరామర్శకు వెళ్లడం వల్లనే ప్రభుత్వం స్పందించిందని, బాధితురాలి మానానికి రూ.10 లక్షలు వెలకట్టి పరిహారం ప్రకటించిందని వ్యాఖ్యానించారు. ఆసుపత్రిని లాడ్జిలా మార్చారని ఆరోపించారు.

బాధితుల పక్షాన తాము నిలిచి న్యాయం జరిగేలా చూస్తే తమకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు.  మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఛాలెంజ్‌లు చేస్తున్నారని, ఎలా కమిషన్ ముందు హాజరుకారో చూస్తానంటూ ప్రతిష్ఠ దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. తమను ఆకు రౌడీలు, అరేయ్.. ఒరేయ్ అంటోందిన ఒసేయ్ అనే భాష మాకు రాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మేకప్ వేసుకొని ఆస్పత్రికొచ్చి అబద్దాలు చెప్పిందని, రాజకీయ కక్షతోనే తమకు నోటీసులు ఇచ్చారన్నారు.  వాసిరెడ్డిని పదవి నుంచి తొలగించేవరకు న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు.

మహిళల హక్కుల్ని కాపాడడానికి ఉన్నారా? వైసీపీ హక్కుల్ని కాపాడడానికి ఉన్నారా?  అని ప్రశ్నించారు. అంత అహంకారం ఏంటని, ఇలాంటి సంఘటనలు జరిగితే ఇంటికెళ్లి పరామర్శించి ప్రభుత్వంతో ఆర్థిక సాయం ఇప్పించాల్సింది పోయి అహంకారంతో మాట్లాడతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఎండలో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తే తప్పేంటన్నారు. మానసిక దివ్యాంగురాలిపై జరిగిన అత్యాచారాన్ని కూడా వాసిరెడ్డి పద్మ, వైసీపీ ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *