దాదాపు 150 కోట్లు ఖర్చు.. బాహుబలి సిరీస్ అంతే సంగతులా!

Bhahubali: టాలీవుడ్ ప్రేక్షకులకు బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఊపిరి పోసిన చిత్రానికి వేరే లెవెల్ లో గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. చెప్పాలంటే ప్రభాస్ ఈ సినిమా ద్వారానే పాన్ ఇండియా స్థాయిలో వెలిగాడు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాగానే వసూళ్ళు చేసింది.

ఇక దర్శక ధీరుడు రాజమౌళి పుణ్యం తో ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ.. పాన్ ఇండియా స్థాయిలో ఫేమ్ తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే నెట్ ఫ్లిక్స్ అనే ఓటీటీ సంస్థ బాహుబలి ‘బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో సిరీస్ ని ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఈ సంస్థ అఫీషియల్ గానే ప్రకటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించాల్సిన ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ సిరీస్ షూటింగ్ కోసం కేవలం ఆరు నెలల్లో అక్షరాల 150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే షూటింగ్ చివరి అవుట్ ఫిట్ పై నెట్ ఫ్లిక్స్ సంస్థ అసలు తృప్తి పొందలేదని ఇన్ సైడ్ టాక్ నడుస్తుంది.

అందుకే ఈ సిరీస్ ను మొత్తానికి లైట్ తీసుకుంది అని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరి త్వరలో అయినా ఈ సిరీస్ బృందం ఈ గాసిప్స్ పై స్పందిస్తుందో లేదో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *