నారీ భేరీ సౌండ్.. నారావారి కర్ణభేరీలో రీసౌండ్ : ఎమ్మెల్యే రోజా

సీఎం జగన్‌మోహన్ రెడ్డి మహిళలను మహారాణులను చేశారని నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమని తెలిపారు.  విజయవాడలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ఎమ్మెల్యే రోజా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. నారీ భేరీ సౌండ్.. నారావారి కర్ణభేరీలో రీసౌండ్ రావాలంటూ విమర్శలు గుప్పించారు. జగన్‌ మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపించారని తెలియజేశారు. మహిళ బావుంటే, కుటుంబం బావుంటుందని నమ్మే వ్యక్తి..  సీఎం జగన్‌మోహన్ రెడ్డి అని అభివర్ణించారు.

మహిళా సాధికారతకు పట్టం కట్టేలా పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం జగన్‌ మహిళలందరికీ దేవుడితో సమానమని ప్రశంసలతో ముంచెత్తారు. ఐదేళ్లు నారావారి నరకాసుర పాలన చూశామని, టీడీపీ అంటే.. తెలుగు దుశ్సాసన పార్టీగా పేర్కొన్నారు. టీడీపీకి 160 సీట్లు వస్తాయనడం హాస్యాస్పదమని, అచ్చెన్నాయుడుకి సరదాగా ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు తలకిందుల తపస్సు చేసినా ఇప్పుడున్న 23 సీట్లు కూడా రావని జోష్యం చెప్పారు.

జగనన్న ఒక వ్యక్తి కాదు 5 కోట్లమంది ప్రజల శక్తి ఉందని వివరించారు. చంద్రబాబు మోసగాడు.. జగనన్న మొనగాడు అంటూ ఓ స్థాయిలో పొగడ్తలు కురిపించారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్, దిశ పీఎస్లుళ తెచ్చారని, ఇంతకంటే మహిళలకు కావాల్సింది ఏంటని ప్రశ్నించారు. రోజా మాట్లాడుతుండగా జగన్ పొంగిపోయారు. చిరునవ్వుతో రోజావైపు చూస్తూ తన అభిమానాన్ని చూపించారు. రోజా మాటలతో సభా  ప్రాంగణమంతా ఈళలు, చప్పట్లతో మారుమోగిపోయింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *