ఓ హీరో నీతిమాలిన పనులు చేస్తున్నారు : మంత్రి పేర్ని నాని
నీతులు చెప్పే ఓ హీరో నీతిమాలిన పనులు చేస్తున్నారని సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య పవన్ ను ఉద్దేశంచి వ్యాఖ్యానించారు. తన సినిమాను ఫ్రీగా వేస్తామని చెప్పారు కదా? అని ప్రశ్నించారు. ఒక సినిమా కోసం చంద్రబాబు, లోకేశ్ పిల్లిమొగ్గలు వేస్తున్నారని మండిపడ్డారు. సినిమాను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలు నాశనం కావడానికి చంద్రబాబు కారణం కాదా? అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులు, ప్రభుత్వ జీవోలు పట్టించుకోరా? అని తెలిపారు.
బ్లాక్ టికెటింగ్ ను నిర్మూలించడం తాము చేసిన తప్పా అని అన్నారు. ప్రభుత్వ చట్టాలు వారికి వర్తించవా? అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఒక్కసారైనా చంద్రబాబు ప్రశంసించారా? అని నిలదీశారు. టీడీపీ, జనసేన, బీజేపీ బ్లాక్ టికెటింగ్ ను సమర్థిస్తున్నాయా? అన్నారు. పవన్ కల్యాణ్ సినిమాను తొక్కేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, సినిమా తీశారు. రిలీజ్ చేశారు.. తొక్కేయడానికి ఏముందన్నారు. జీవో 35 ప్రకారం టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించిందని, హైకోర్టు తీర్పు అన్నా, ప్రభుత్వమన్నా వీరికి లెక్కలేదన్నారు.
బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి కారణం చంద్రబాబేనని, బ్లాక్ లో టికెట్ల అమ్మకం రాజ్యాంగ హక్కు అనుకుంటున్నారని విమర్శించారు. సినిమా పెద్దలు వచ్చారు.. జీవో ఇస్తామన్నారు.. ఇప్పుడు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారన్నారు. 24వ తేదీన జీవో రావాల్సిఉంది.. కానీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతితో ఆలస్యమైందని వివరించారు. మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో మంచి నాయకుడిని కోల్పోయామని, ఆయన మరణంపై అవాకులు చవాకులు పేలే పరిస్థితికి టీడీపీ నేతలు వచ్చారని ఫైర్ అయ్యారు. ఎవరు చనిపోయినా శవ రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అని,చంద్రబాబుకి మనుషుల విలువ తెలియదని ఆరోపణలు చేశారు.