అమరావతే రాష్ట్ర రాజధాని.. మార్చడం ఎవ్వరి వల్లా కాదు- రఘురామ

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్రానికి రాజధాని విషయంలో అనేక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి చంద్రబాబు పాలనలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ.. శంకుస్థాపన చేసి.. అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజధాని అభివృద్ధిలో భాగంగా చుట్టుపక్కల భూములను కొనుగోలు చేసి.. ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు కూడా. అయితే, అనుకోకుండా, తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభత్వం అధికారంలోకి వచ్చి.. సడన్​గా అమరావతి రాజధానిగా పనికిరాదని.. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ సరికొత్త నినాదాన్ని వినిపించాయి. ఈ క్రమంలోనే మూడు రాజధానులను కూడా ప్రకటించి.. పెద్ద చర్చకే తెరలేపారు జగన్​.

mp-raghu-rama-senstational-comments-on-amaravathi

ఆ తర్వాత జగన్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు. మాకు అమరావతే రాజధానిగా కావాలంటూ ఏపీ ప్రజలు కూడా పట్టుపట్టుకుని కూర్చున్నారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులు మహాపాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాదా,  చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏర్పాటు చేసిన యాత్ర ముగింపు కార్యక్రమంలో ఎంపీ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని అన్నారు. రాజధానిపై కులముద్ర వేశారని.. ఉన్న ప్రభుత్వం అర్థం చేసుకోలేక.. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఈ రాజధాని రూపశిల్పి చంద్రబాబేనని కొనియాడారు. అమరావతిని మరో సింగపూర్​గా తీర్చిదిద్దొచ్చని.. అన్నారు.

మరోవైపు రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేదనిదని పొగిడారు. ఇంకొంత కాలం ఓపిక పట్టాలని.. కచ్చితంగా రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతేనని నొక్కిమరీ చెప్పారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబును రఘురామకృష్ణ ఆలింగనం చేసుకున్నారు. అమరావతికి మద్దతుగా నిలిచనందుకు రఘురామకు అభినందనలు తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *