వామ్మో.. లావు పెదవుల కోసం 26 ఇంజెక్షన్లు తీసుకున్న మోడల్.. త్వరలోనే మరొకటి?

సాధారణంగా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఈ క్రమంలోనే అందమైన శరీరాకృతి కోసం ఎన్నో రకాల సర్జరీలు చేయించుకోవడం మనం చూస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే చాలా మంది హీరోయిన్లు పెదాలు ముక్కు సర్జరీలు చేయించుకోవడం మనం చూస్తూ ఉంటాము. అయితే లావు పెదాల కోసం ఒక మోడల్ ఏకంగా 26 ఇంజెక్షన్లను చేయించుకుంది. ఆ మోడల్ ఎవరు అసలు మ్యాటర్ ఏమిటి అనే విషయానికి వస్తే…

ఆండ్రియా ఇవనోవా అనే బల్గేరియాకు చెందిన మోడల్ ప్రపంచంలోని అత్యంత లావు పదాలు కలిగిన మోడల్ గా పేరు సంపాదించుకుంది. ఈమెకు బార్బీ బొమ్మల కనిపించాలని ఎంతో ఇష్టంతో తన పెదాలు లావుగా మారడం కోసం 26 ఇంజెక్షన్లను తీసుకుంది.బార్బీ బొమ్మలా అందంగా కనిపించాలంటే పెదాలు లావుగా ఉండాలి అని చెప్పడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బార్బీ బొమ్మలా అందంగా ఉండాలంటే కింది దవడ పొడవుగా ఉండాలని చెప్పడంతో త్వరలోనే కింది దవడ సర్జరీకి కూడా సిద్ధమైంది.

ఇలా ప్రతిసారి ఇంజక్షన్ వేయించుకున్నప్పుడు ఈమెకు భారీ మొత్తంలోనే డబ్బు ఖర్చు అవుతుందని తెలిపారు.ఇక ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమెకు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా ఆ పెదాలు తనకు అందవిహీనంగా ఉన్నాయని చెప్పలేదని, తనని ఇంకా ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. ఈ క్రమంలోనే మరికొందరు డబ్బు అవసరమైతే ఏమాత్రం మొహమాట పడకుండా మమ్మల్ని అడగండి మేము ఇస్తామంటూ కామెంట్లు చేస్తున్నారంటూ వెల్లడించారు. ఏది ఏమైనా ప్రపంచంలో ఇలాంటి అత్యంత లావు పెదాలు కలిగిన మోడల్ గా ఈమె పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *